SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 08 Jul 2019
సాధన కొనసాగిస్తేనే ఆశ్రమం లో నివాసం దక్కును

సాధన కొనసాగిస్తేనే శ్రీహరి దర్శనం కూడా కొనసాగుతుంది. లేకపోతె పోతుంది. నాకు ముక్తి వచ్చేసింది అన్నవాడికి ముక్తి రాలేదు అని ఖాయం. నాకు స్వామిజి కృప దక్కింది, ఆశ్రమం లో నివాసం దొరికింది అని అనుష్ఠానం మానేసినవాడికి త్వరలోనే ఉద్వాసన ఖాయం. ఏదో పూర్వ పుణ్యం వల్ల నీకు ఆశ్రమ వాసం దక్కింది. ఇది నీ పుణ్యానికి ఫలం. దీన్ని అనుభవించి పారేస్తూ ఉంటె త్వరలోనే ఇది అయిపోతుంది. నీ దెగ్గిర పుణ్యం బాలన్స్ ఉండదు కనుక ఆపై నీకు మళ్ళి ఈ సదవకాశం దొరకదు. కనుక నువ్వు ఆశ్రమం లో చేరిన దెగ్గిర నించి నీ ప్రార్థనలు పెంచాలి. సాధన పెంచాలి.

రాక్షస గుణాలు వెంటనే అంటుకుంటాయి. అవి వైరస్ లాంటివి. వాటిని పలకరించ వద్దు. రెసిస్టన్స్ లోపం వల్ల వ్యాధులు వస్తాయి. ఆధ్యాత్మిక శక్తి, మనో బలం,గురు బలం లోపించటం వల్ల దుర్గుణాలు వస్తాయి.

కొంతమంది ‘నేను స్వామిజి సెవకుడిని’ అన్ని గర్వంగా చెప్పుకుంటారు. కానీ, నిజానికి స్వామిజి మీకు సేవకుడు. ఎందుకంటె,‘స్వామి, నన్ను రక్షించు. శక్తినివ్వు. అప్పుడు నేను నిన్ను సేవిస్తాను ‘- అని కదా భక్తుడు ప్రార్థిస్తాడు. మరి, ఎవరు, ఎవరికి సేవ చేసినట్టు?

(భక్తిమాల జూన్ 1991)

Tags: