వందనము, ప్రదక్షిణము, నమస్కారము, మంత్రం పుష్ప పఠనము, నామ స్మరణము, మొదలైనవి అన్ని పూజలలో ఉంటాయి. మనకి తెలిసిన మంత్రములతోనే మన ఇష్ట దైవాన్ని పూజించుకొనవచ్చు. తూర్పు ముఖం గాని, ఉత్తర ముఖం గాని కూర్చొని పూజించవలెను.
మనము టెంకాయి కొట్టి భగవంతుడికి అర్చిస్తాము. దాన్ని అర్థం మనలోని అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞాన వికాసాన్ని ఇవ్వమని కోరడం. శాంతి సుఖాలను కోరడమే ఈ రెండు తునకలు భావము. కర్పూర హారతి దర్శించడం అంటే జ్ఞాన జ్యోతి ని సందర్శించడమే. ఊదొత్తులు వెలిగించడం లో తనలోని అజ్ఞాన అంధకారంచే యావరించి ఉన్న దుర్వాసనాలు అన్ని తొలిగిపోయి సువాసనతో జ్ఞాన వికాసాన్ని వెలిగించమని ప్రార్థన. ఫలాదులు సమర్పించడం అంటే ఆత్మార్పణ చేసికోవడం.
స్వామిజి వారు శ్రీచక్రార్చననంతరం ఇచ్చే తీర్థం సర్వ మూలికా తీర్థము.
మన శరీరములో భ్రమరాంద్ర మనియు, బ్రహ్మకపాల మనియు ఉంది. దీనినే సుమేరు స్థానమని శాస్త్ర వేత్తలు అంటారు. ఈ సుమేరు స్తానం లో కుండలిని శక్తిని నిలిపి సర్వదా అనుసంధానము చెయ్యాలి. బ్రహ్మ వేత్తులు, యోగులు మనతో మాటలాడుతూ ఉన్నా వారి ద్రుష్టి పరబ్రహ్మలోనే లీనమై ఉంటుంది. వీరే జీవన్ముక్తులు.
కానీ నేటి మనుషులు జన్మకు కారణమేమీ ఉంటుందో తెలుసుకోక, ఎందుకీ జన్మ వచ్చిందో మరిచి స్వార్థచింత పరాయణులై కామ, క్రోధ, లోభ,మద, మాత్సర్యాలకు లోనవుతున్నారు.
(తెలుగు భక్తిమాల మే 1980)