SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 08 Jul 2019
మరకత; మార్జాల; మీన కిశోర న్యాయం.

గురుగీతలో గురువును ఎదురుగానే పొగడమని చెప్పేరు. నిజానికి గురువు స్తుతినిందలకు అతీతుడు. ఆయన ఒక రాయి; ఒక రత్నం కూడా . ఆయన ఒక పువ్వు కూడా; ఆయన వెన్న కన్నా మెత్తన.

ఆయన హృదయం వెన్న వంటిది. ఈ వెన్న మంచు పట్టినా కరుగుతుంది. అదే హృదయం వజ్రం కూడా అవుతుంది.

వజ్రాన్ని మరో వజ్రం తో కొయ్యవచ్చు. ఈ వజ్రానికి మరో వజ్రం తగిలితే మరీ కఠినం అవుతుంది.

అలాఅయితే ఆయన ఎప్పుడు మృదువుగా ఉంటారు ? ఎప్పుడు కఠినంగా ఉంటారు ?

అది తెలుసుకోవడం కష్టం. ఊరికే చూస్తూ ఉండాలి. కారణం? ఆయన అనుక్షణం ప్రపంచం అంతా చూస్తున్నారు. మీరు ఈ గురు వృక్షం కింద ఉన్నారు. మీరు సురక్షితులు. అదృష్టవంతులు. ఆయన నిన్ను ఆయన సన్నిధికి చేర్చడమే నీ అదృష్టం. ఆయన పొమ్మంటే తిరుగు లేదు. దీనిని మించి ఆయన మనస్సులోంచి నిన్ను తీసేస్తే మరి దిక్కు లేదు.

దెగ్గిర ఉంచుకున్నారు కనుక, ఎప్పుడు నీతో మాటలాడుతారు అనుకోకు. గురువు నీతో మాటలాడనప్పుడు ఆయన లోలోపలే నీతో మాట్లాడుతున్నారని గుర్తు ఉంచుకో. దీనినే మరకత కిశోర న్యాయం అంటారు. కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. తల్లి ఎగిరినప్పుడు అదే గట్టిగా పట్టుకుంటుంది. తల్లి ఎగురుతున్నపుడు పిల్ల గాని తల్లిని వదిలితే, ఆ పిల్ల కింద పడిపోతుంది. అలాగే,

గురుగారు తన పని చేసుకుంటూ ఉంటారు. నీవు మనస్సులో ఆయనని గట్టిగా పట్టుకొని ఉంటావు. నువ్వు గాని వదిలితే నువ్వే పడిపోతావు; నష్టపోతావు.

ముందు స్వామిజి భక్తుడితో పిల్లి తన్న పిల్లలతో వ్యవహరించినట్టే వ్యవహరిస్తారు. అంటే పిల్లి తన పిల్లలను నోట కరాచీ పట్టుకున్నట్టు స్వామిజి భక్తుడిని పట్టుకుంటారు. పిల్లి పిల్లలని అలా పట్టుకొని తనతో పాటు తీసుకువెళ్లినట్టు, స్వామిజి భక్తులని చూసుకుంటారు. దీనినే మార్జాల కిశోర న్యాయం అంటారు. తరవాత వచ్చేది మరకత కిశోర న్యాయం.

ఇంకొకటి మీనా కిశోర న్యాయం. తల్లి చేప పిల్లలకు కేవలం తన చూపులతో ఆజ్ఞ ఇచ్చి పోషిస్తుంది. అలాగే స్వామిజి తన దృష్టి తోనే అనుగ్రహిస్తారు. ఇక వేరే మాటలు, ఓదార్పులు ఉండవు. కానీ ఈ విధానం కొంచం పై మెట్టు.

ఏ విధమైతేనేమి? సద్గురు మానని దెగ్గిర ఉంచుకుంటే చాలు. అదే మన భాగ్యం

(భక్తిమాల సెప్టెంబర్ 1991)

Tags: