సేవ వల్ల అజ్ఞానం ఎలా పోతుంది? - అని సందేహం వస్తుంది.
అజ్ఞానం అంటే ఏమిటి? దీన్ని తేల్చి చెప్పగలవా? పోనీ ఎలా వచ్చిందో చెప్పగలవా? లేదు. మనస్సులో ఏదో ఒక సమస్య ఉంది. దాని వల్లే నువ్వు అజ్ఞానివిగా ఉన్నావు. కానీ ఆ సమస్య ఏమిటో వివరించి చెప్పలేవు. ఒకడు వ్యాధుడు దెగ్గిరికి వెళ్లి, ‘నాకు భాదగా ఉంది’. అన్నాడు. ‘ఏమి భాద?’ అంటే, ‘అది నేను చెప్పలేను. నువ్వు వైద్యుడివి కదా. నువ్వే నా భాద తెలుసుకొని నాకు మందు ఇవ్వూ’ అన్నాడు.
వ్యాధుడు పరిశీలించి, ‘నీకు ఏ రోగము లేదు. ఒక భ్రమ అంతే’ అన్నాడు. కానీ రోగి దానికి అంగీకరించలేదు.
‘నేను బాధపడుతుంటే రోగం లేదు అంటావేంటయ్యా? నాకు మందు ఇవ్వూ’ అని అడిగేడు.
ఇదే నీ పరిస్థితి కూడా. నీ వ్యాధి అజ్ఞానం. అది చిత్రమైన వ్యాధి కనుక దానికి మందు కూడా చిత్రమైనదే. గురువును అనుసరించడం అనేది మందు. అదే గురు సేవ. గురు నామమే నీకు మంత్రం, తపస్సు, ధ్యానం. అంతే చాలు. తృప్తి గా ఉండి , గురువును అనుసరించు. అదే పూర్ణత్వానికి మార్గం. ఆయన పూర్ణుడు కనుక ఆయన తన పూర్ణత్వాన్ని నీకు అందిస్తాడు.
(భక్తిమాల ఆగష్టు 1991)