భక్తుడికి, భగవంతుడికి మధ్యన అలాగే గురుకి శిష్యుడికి మధ్యన ఏర్పడే సంబంధం అలౌకిక మయినది. నిజమేగాని, అది నిరంతరంగా జాగర్తగా కాపాడుకుంటెన్ నిలుస్తుంది.
ఎన్నో పిచ్చి మొక్కలు మన పోషణ లేకుండానే పెరుగుతుంటాయి. నిజమైన ఓషది మొక్కలు మటుకు జాగర్తగా రక్షిస్తేనే బతుకుతాయి. గురు శిష్య సంబంధం కూడా అట్టిదే. లతలకు నీళ్లు, ఎరువు, వగైరాలు కావాలి. గురు శిష్య సంబంధానికి నిరంతరం సాంగత్యమే నీరు. త్యాగమే ఎరువు.
సంసారంలో, వృత్తులలో ఉండేవారు గురువుతో నిరంతరము సాంగత్యం కావాలంటే సాధ్యం అవుతుందా? అవుతుంది. గురువుతో సాంగత్యం అంటే అది మానసికమే కానీ శారీరికం కాదు. నువ్వు గురువు ఎదురు కూర్చొని ఉన్నా, నీ ఆలోచనలు వేరోక చోటు ఉంటె గురువు దృష్టి లో అది సాంగత్యము కాదు. మీరు, మీ సంసారకృత్యాలలో ఉంటూనే మీ గురువుతో నిరంతరము సాంగత్యములో ఉండటం ప్రయత్నించాలి. అది ఒక కళ.
(భక్తిమాల జనవరి 1992)