SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 28 Jun 2019
గురువు నుండి వచ్చిన ప్రసాదము పాపములను కడిగివేయును.

గురువు నుండి వచ్చిన ప్రసాదము పాపములను కడిగివేయును. నేను భోజనము చేసేటప్పుడు నా (స్వామిజి) ఆలోచనలు అత్యధిక శక్తివంతుడైన పరమాత్మా మీదనే ఉంటుంది. ఆ జప ప్రభావము ఆ ఆహారములోనికి, నీటిలోకి, గాలిలోకి ప్రవహిస్తుంది. ఆ జప ప్రభావమే మెదడును శుభ్ర పరుస్తుంది. స్వామిజి ప్రతిఒక్క భక్తుడి ఆవశ్యకత తెలుసుకొని వాడికి అనుగుణముగా సేవను వాడికి ఇస్తారు.

కొన్నివేళల్లో స్వామిజి కోపముగా ఉన్నట్లు ఉంటుంది. అలా బాహ్యముగా కనిపించినా ఆంతర్యముగా స్వామిజి ఎల్లవేళలా ఆనందంగానే ఉంటారు. స్వామిజి ఇతరవ్యక్తుల కన్నా భిన్నం గా ఉన్నారు. ఆయన ఈ భౌతిక దేహము కూడా భిన్నంగా ఉంది. స్వామిజి కి జీర్ణమండలం లేదు. (ఈ విషయంపై ట్రినిడాడ్ వాస్తవ్యులు డాక్టర్ చందూల్ అనువారు స్వామిజివారు కావేరినది యందు స్నానము చేసేటప్పుడు పిడికిలి నిండా రాళ్లను తినడం చూసినట్లు చెప్పేరు). స్వామిజి గొంతులో శ్రీచక్రా కారపు గడ్డ ఒకటి ఉండేది. అది శాస్త్ర ప్రయోగముచే తీయబడింది.

పరమాత్ముడు కి ఏ రూపము లేదు. బిందుమాత్రుడై ఉన్నాడు. నువ్వే జన్మలు కోరుకుంటున్నావు. ఒకమారు భారత దేశములో పుట్టేవు; ఇంకో సారి ఇస్రేల్ లో పుట్టేవు; ఇంకో సారి అమెరికా లో జన్మించేవు. అలా ఈ చక్రం తిరుగుతూనే ఉంది. ఈ చక్రాన్ని ఆపాలని నువ్వు ప్రయత్నించాలి. భక్తి యోగముగాని, కర్మ యోగముగాని అభ్యసించు. నా చక్రం ఆగినదా? నా చక్రం ఆగిందన్న విషయం నాకు ఎవరు చెప్తారు? అనే విషయంపై బెంగపడకు. నీ చక్రం ఎప్పుడు నిలుస్తుందో, అప్పుడు నేను కూడా నిలిచిపోతాను. ఎందుకంటె నేను నీవెనుక వాస్తు ఉన్నాను కనుక.

శంకరాచార్యులు వారికి పద్మపాదా అనే ఒక శిష్యుడు ఉండేవాడు. చాలా భక్తి గా సేవ చేసేవాడు. అతడు గురువుగారి బట్టలు ఉతకడం, మరి మిగిలిన సేవలన్నీ తప్పక చేసేవాడు. తన సేవలతో గురువుగారిని మొప్పించేడు. అయినప్పటికీ శంకరాచార్యులువారు పద్మపాదుడికి ఒక్క మాట కూడా బోధించ లేదు. ప్రతిదినము చాలామంది జనులు వచ్చి ప్రస్తావించుట పద్మపాదుడు చూసేవాడు. అనేకమంది ఆయననుండి జ్ఞానము పొందుట కూడా చూసేవాడు. స్వామి నాకు కొంచం కూడా జ్ఞానము కలిగించలేదు అని పద్మపాదుడు అనుకున్నాడు.

ఒకనాడు పద్మపాదుడు తన గురువుగారి బట్టలు ఉతుకుతూ ఆ బట్టలను తన తలపై ఉంచుకోవాలి అని నిశ్చయం చేసుకొని, అలా తల మీద పెట్ట్టెడు. ఆ బట్ట నుండి కారిన నీరు తన ముఖంపై నుండి జారుగా వాడి మెదడులో జ్ఞానము ప్రవహించింది. అనేక నిమిషాలు పద్మపాదుడు మహాఆనందం లో తన్మయుడైయ్యాడు. నా గురువు యెంత శ్రేష్ఠుడు అని అనుకున్నాడు.

హఠాత్తుగా మల్ల అనుకున్నాడు, ‘నేను ఈ మహా ఆనందంలో మాగ్నమ్ అయి ఉంటె నా గురువుగారి వస్త్రములు ఎవరు ఉతుకుతారు? నాకు ఇప్పుడు ఈ జ్ఞానము అఖ్ఖరలేదు. దీనిని నేను నా జీవిత అంతిమసాయంలో గ్రహిస్తాను. నా గురువు యెంత శ్రేష్ఠుడు. నేను ఆయనకు సేవ చెయ్యాలి’- ఇది ఒక ఉత్తమ శిష్యుడి ఉదాహరణ.

(తెలుగు భక్తిమాల నవంబర్ 1980)

Tags: