సద్గురువుతో విడాకుల ప్రశ్న ఉండదు. ఎందుకంటె, ఆయన నరకం లో కూడా మనని వెంబడిస్తాడు. ఆత్మరూపుడైన సద్గురువు మనలోనే ఉన్నారు.
ఒకరి మీద నేరాలు చెప్పడం మంచి పధ్ధతి కాదు. వాళ్ళు కూడా భక్తులే కదా. ఒకరు పూర్తి చెయ్యని పనిని మనమే పూర్తి చెయ్యాలి. సద్గురు సేవ చేద్దాం, సేవించే వారికి సహాయం చేద్దాం - అది మనకి పాడి పంట.
మీ స్వామిజి ఒక పడవ. ఆ పడవలో ఎక్కినాక, ఇక వెనుక నడక ఉండరాదు. ఈ పడవ లో ఎక్కటానికి చాడీలు ఉపకరించవు. ఇంకొకటి జ్ఞాపం పెట్టుకోవాలి. ఎవరైనా సేవ పూర్తి చెయ్యకపోతే, ఆ సేవ కూడా నీకే దక్కింది అని అనుకోవాలి.
మన జీవితం చాలా చిన్నది. వంద ఏళ్ళు బతికినా, అది చిన్నదే. దీనిని వ్యర్థం చేసుకోకూడదు. మీకు ఉన్న జీవిత విధానాన్ని- మంచిని, చెడును, సుఖాని, దుఃఖాన్ని, అంతా స్వా,మీజికి సమర్పించుకోవడం నేర్చుకొండి.
కొందరు స్వామీజీని నెగటివ్ దృష్టి లో చూస్తారు. స్వార్థంతో చూస్తారు. ఇలాంటివారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. వీరు తినటం, నిదురించటం, పోట్లాటడం, నేరాలు చెప్పడం- వేటిలోనే సమయం వ్యర్థం చేసుకుంటున్నారు.
గురుతత్త్వాన్ని గురించి ఎవ్వరు ఆలోచించరు. మీ నివేదికలలో కూడా డబ్బు విషయాలే చెపుతారు గాని, జ్ణారార్చన గురించి అడగరు. మీ సభలలో భాగవత సప్తాహాలు పెట్టించేరా? కోటి నామావళి రాయించేరా? భక్తిమాల మొదటి శ్లోకమైన చదివేరా? మనలో పరివర్తన రావాలి. లేక పొతే గురు స్నేహానికి ప్రయోజనం లేదు. పెద్ద కట్టడాలు కట్టిస్తే ప్రయోజనం లేదు. మనిషిలో మార్పు రావాలి. గురుగీత, దత్త దర్శనం వంటి గ్రంథాలు చదవాలి. జ్ఞానం వేపు దృష్టి పెట్టాలి.
(స్వామిజి పుట్టినరోజు)- మీరంతా ఆధ్యాత్మిక పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఇలాగే ప్రతిరోజూ కూడా మీ ఇళ్లలో ఆనందంగా ఉండండి.
(భక్తిమాల జులై 1991)