21 సంవత్సరాల వెంట మీలో 200 మంది తెల్లవారుజామునే స్నానం చేసి ఉదయం 4 ఘంటల నుంచి సాయంత్రం 4 ఘంటల వరుకు కృష్ణ బారేజి దెగ్గిర అలాగే నిలబడి ఉన్నారు. ఆ భక్తిని మీ స్వామిజి మరిచి పోలేరు. శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణ, కావేరి, అర్క తుంగభద్రా నదీ తీరాలలో సంచరించేవారు. అప్పుడప్పుడు వారణాసి వెళ్లి వాస్తు ఉండేవారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులలో ఆయన ఈ ప్రాంతాలలో తిరిగేవారేమో మరి! ఆ రోజులలో ఆయన భక్తుల హ్రదయాలలోనుంచే భిక్ష సవీకరించేవారు. ఇది మీకు కూడా అనుభవమే కదా!
ఇలాంటి మాటలు వింటుంటే ఆనందం గా ఉంటుంది. కానీ మరో పక్క ‘మన కర్మల వల్ల ఆయన కూడా మళ్లీ జన్మించ వలసివచ్చిందే’ అని విచారం కూడా కలుగుతుంది. మనకోసం మన వెంబడి ఆయన రావడం బాధాకరమే. అందుకే మీరు మీ ఆలోచన విధానం కొంచంగా మార్చు కోవాలి.
‘స్వామి నువ్వు పుట్టినప్పుడల్లా నన్ను నీ వెంట ఉండేలాగా పుట్టించుకో’ - అని ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని అనుసరించడం గాక,మీరు ఆయనను అనుసరించడం సంభవిస్తుంది. భక్త తుకారాం ‘నాకు మోక్షం వద్దు. నీ నామ భజన చేసేందుకై మరల మానవ జన్మ అనుగ్రహించు’ అనే కోరేడుట.
మీరు తెలిసి తప్పులు చేయకపోవచ్చు. తెలియకుండానే కొన్ని పాపాలు జరిగి ఉండవచ్చు. దానిని క్షమించమని కోరరాదు. ‘శిక్షించు గాని, నీకు పనికివచ్చే జన్మనే ఇయ్య్ - అని కోరటం నేర్చుకోవాలి.
ఎందుకంటె గురుసేవ చేద్దామని నువ్వు అనుకుంటే చాలదు. ఆయన కూడా అనుకోవాలి. అందువల్ల, ‘స్వామి! నీకు దూరమయేటటు అయితే నాకిక జన్మ వద్దు. మోక్షం ఇవ్వు. నీకు దెగ్గిరి భక్తుడయ్యేటట్లు అయితే , నాకు మోక్షం వద్దు, జన్మ ఇయ్యి. - అని తుకారాం భగవంతుడిని అడిగేడుట. మీరు కూడా అలా కోరడం నేర్చుకొండి .
స్పీచ్ 26-12-90; భక్తిమాల మార్చ్ 1991