SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
అన్నం బ్రహ్మ

లోకాలను సృష్టించే తల్లి! నువ్వు ఆహారాన్ని కారణంగా పెట్టుకొని జీవులను స్రిష్టిస్తు ఉన్నావు, నిలబెడుతున్నావు, హరిస్తున్నావు. అయితే! ఓ విరాట్ స్వరూపిణి! నీకు అర్పణ చేసిన ఆహారం బ్రహ్మమే అవుతుంది. ఆ ప్రసాదమే మనసులోపలి మొహాలను సంహరిస్తుంది.

తానేకాక తన వాళ్ళందరూ సుఖం గా ఉండాలని కోరుకోవడం సహజం. అంతేగాక, తనవాళ్లు కష్టపడుతుంటే దుఃఖపడుతాడు మనిషి. అంటే, ఇక్కడ ‘తను’ అనే పదం లో తన శరీరము మాత్రమే కాక, తన బంధువులు, మిత్రులు అంటా చేరినట్టేకదా?

దత్త దర్శనం లో ఒక చోట మోహము, మహామోహము అని 5 రకాల మొహాలను వర్ణించెరు . అందులో ఇది అంధ తామిస్రం క్రిందకి వస్తుందన్నమాట. ఇది పోవాలంటే తన శరీరం అంటే ఏమిటో అది ఎలా వచ్చిందో ఆలోచించాలి.

స్రిష్టికర్త అయినా భగవతి వేసిన ప్రణాళిక వల్ల ఆకలి ఉంది, ఆహారం ఉంది. జీవులు తినే ఆహారమే క్రమంగా రక్తంగా మాంసంగా పరిణామం చెందుతూ పోయిపాయి చివరకు మరో శరీరాన్ని స్రిష్టి చేస్తుంది. అలా పుట్టిన జీవి తానూ మితంగా శుచిగా ఆహారం తీసుకుంటునంత కాలం సుఖంగా జీవిస్తాడు. ఆహారంలో వ్యత్యాసం వల్ల జీవి చివరకు మరణిస్తాడు కూడా!

కనుకనే ప్రతిజీవి ఆహారంవల్లే పుడుతున్నాడు, ఆహారంవల్లే బతుకుతున్నాడు, ఆహారంవల్లే మరణిస్తున్నాడు.

ఇక ఇంకో విషయం. ఈ స్రిష్టి లో అన్ని జీవరాశులు కలిపితే భగవతి యొక్క విరాట్ స్వరూపం ఏర్పడుతుంది. ఇది కూడా ఒక శరీరమే కదా?కనుక దీన్ని కూడా స్రిష్టించేది ఆహారమే కావాలి కదా?

మన శరీరాలన్నీ కలిపితే దేవి విరాట్ శరీరం ఏర్పడినట్లైతే, మన ఆహారాలన్నీ కలిపితే దేవి విరాట్ శరీరానికి ఆహారం అవుతుంది కదా. అది విరాట్ శరీరానికి కారణం కనుక అది శాక్షాత్తుగా పరబ్రహ్మమే కావాలి. అది పరబ్రహ్మమే అయితే దానిలో అంశమయిన మనం తినే అన్నం కూడా పరబ్రహ్మమే కావాలి.

అందుకే మనం తినే ఆహారం పరబ్రహ్మమే. అందుకే స్వామిజివారు ఆశ్రమం లో ‘అన్నం బ్రహ్మ’ అని రాయించేరు. ప్రతిరోజూ ఆహారం తీసుకునేటప్పుడు ఈ ఆహారమే సమస్త లోకాలను స్రిష్టించి,పోషించి, చివరకు లయం చేస్తుంది అందువల్ల ఇది పరబ్రహ్మమే అని భావన చేస్తూ తినాలి. ఇదే అన్నోపాసన

**అలాగే మనం తినే ముందు ఆ ఆహారాన్ని భగవతికి అర్పించడం అభ్యాసం చెయ్యాలి.**అన్నం సహజంగా బ్రహ్మమే అయినా, పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతకు అర్పించడంవల్ల దానిలో బ్రహ్మశక్తి ద్విగుణీకృత మవుతుంది. ఇందుకే నవరాత్రులలో భగవతి రకరకాల నైవేద్యాలు చేస్తుంటారు తినే ప్రతీది ఆ తల్లి ప్రసాదంగా తినటం అన్నోపాసనలో రెండో విధానం. ఇలా అన్నాన్ని బ్రహ్మగా ఉపాసించేవారికి రెండు లాభాలు కలుగుతాయి. వారికి అన్నానికి లోటు ఉండదు. రెండు, భగవతి విరాట్ స్వరూప దర్శనం లభిస్తుంది.

(12-10-1991 అనుగ్రహ భాషణం- భక్తిమాల జనవరి 1992)

Tags: