SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
స్వయం సేవ- వాలంటీర్స్ కి సందేశం

మీరంతా స్వయం సేవకులు - ఆశ్రమ సేవ చెయ్యాలి అని ముందుకు వచ్చేరు. కనుక నిస్స్వార్థత గురించి మీకు మంచి అవగాహన ఉండాలి. వాలంటీర్లు గా ఉన్నారు కనుక మీరు ఆశ్రమానికి, స్వామీజీకి మరింత సన్నిహితం అవుతారు. అది మీకు ఒక ఆకర్షణగా ఉంటుంది. అది మీకు ఒక అదృష్టం కూడా. కానీ, దాని గురించిన అవగాహన మీకు మరింత లోతుగా ఉండడం అవసరం కనుక స్వామిజి మీకు చెపుతున్నారు.

స్వామీజీకి దెగ్గిర ఉండి సేవ చేసేవారిని నాలుగు రకాలుగా లెక్క వెయ్యవచ్చు. 1) స్వామిజి కి అతి సన్నిహితం గా ఉంది అంతరంగికులుగా పనిచేసేవారు. వీరిని మొదటి ఆవరణ అనవచ్చు. ఇలాంటి వారిని చూసినపుడు బయటివారికి చాలామందికి అసూయగా ఉంటుంది. ఆ స్థితికి చేరిన వారికి మనసుకు ఒక తృప్తి వాస్తు ఉంటుంది. కొత్త వాలంటీర్లకు తాము అలంటి స్థితికి ఎదగాలని ఉంటుంది. కానీ గమనించండి- ఈ మొదటి ఆవరణ వారికి నూటికి 90 వాంతులు నిత్యం ప్రమాదంగా ఉంటుంది. వారు నిత్యం నిప్పులలోనే ఆటలాడుతూ ఉంటారు. అది తప్పదు వాళ్లకి. మరి వాళ్లకి వచ్చే లాభం ఏమిటి? అది ఆత్మా సంస్కారానికి సంబంధించి ఉంది. అది కంటికి కనిపించేది కాదు.

రెండవది- ఆశ్రమంలోనే ఉంటూ ఆశ్రమంలో ఏదో పని చేసుకుంటూ ఉండేవారు. వీళ్లకు నూటికి 10 వాంతులు మాత్రమే ప్రమాదం. తమ పనుల్లో ఉండి యథాశక్తి స్వామిజి సేవ చేసుకునే వారు మూడో ఆవరణ. వీరికి నూటికి ఒక పాలే ప్రమాదం. ఇక కొందరు అప్పుడప్పుడు వస్తారు. ఏదో వాళ్లకు తోచిన సేవ చేసి వెళ్తారు. వాళ్ళు నాలుగోవ ఆవరణ. వాళ్లకి అసలు ప్రమాదం లేదు. వీరు స్వామిజి వల్ల అత్యధిక మేలు పొందుతారు. అదే చిత్రం!

అయితే, ఏ ఆవరణలో భక్తులైన సరే. వాళ్ళు యెంత దూరంగా ఉన్న సరే. వాళ్ళు యెంత రహస్యంగా సంచరించా సరే. తన భక్తులు చేసే తప్పులన్నీ సద్గురువుకు తెలిసి తీరుతాయి. స్వామిజి నిశ్శబ్దం గా పరిశీలిస్తూ ఉంటారు. సమయం చూసి శిక్షించి సరి చేస్తూ ఉంటారు.

కాలం అమ్మోల్యమైనది. శరీరం శాశ్వతం గా నిలిచి ఉండదు. రాముడు కృష్ణుడు గతించ లేదా? కాలం ఉన్నత లో మీకు అర్హత ఉన్నంతవరకు సేవ చేసుకోండి. మంచిగా ఆలోచిస్తూ మంచిగా మాటలాడుతూ మంచి పనులు చేస్తూ జీవితం అంతా మంచిగా కొనసాగించండి. మీకు అన్ని రకాల శుభాలు కలుగుగాక.

(భక్తిమాల మార్చ్ 1991)

Tags: