SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
భయం అభయం

ప్రపంచంలో అందరికి ఏదో ఒక భయం ఉంటుంది. భయాలు అనేక రకాలు. ఇందుకు కొన్ని 100ల ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఏ భయం ఉన్నా లేకపోయినా మరణ భయం మాత్రం తప్పదు. ఈ మృత్యుభయం వల్లనే మనస్ శాంతి నశిస్తుంది. దీని వల్ల మనకు కక్కూర్తి బయలు దేరుతుంది. దీని వల్ల అడ్డ ధోవలలో కోరికలు తీర్చుకోవాలని ప్రవ్రుత్తి హెచ్చు పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ దుస్థితి తొలగాలంటే మీరు భయం లేని స్థితికి ఎదగాలి!

ఈ భావం తోనే అప్పుడప్పుడు స్వమిజి ‘ధైర్యంగా ఉండు’ అంటూ ఉంటారు. కానీ జనం స్వామిజి భావన గ్రహించలేక, ‘ధైర్యం గానే ఉన్నానండి - నా ఈ సమస్య సంగతి చెప్పండి’ అని అంటారు. వాళ్లకు భయం అంటే తెలియదు; ధైర్యం అంటే తెలియదు.

భయాలన్నిటికి మూలం మరణ భయమే అని అన్నాము కదా! ధైర్యంగా ఉండు అని స్వామిజి చెప్పేరు అంటే - నిన్ను ఆ భయం లోంచి బయట పడేందుకు ఆయన ప్రయత్నం ప్రారంభించారు అన్నమాట. అయితే, ఈ పని అంత తేలికకాదు. నీకు ఏదో ఒక వ్యవహారపు చిక్కు వచ్చి, కోర్టుల్లో కేసులు, లాయర్లు దెగ్గిరకి వెళ్ళావనుకో- మామూలు లాయర్ అయితే, ‘లాభం లేదు నాయనా. ఈ కేసు గెలవలేము’ అంటాడు.

నువ్వు ఇంకా పెద్ద లాయర్ దెగ్గిరికి వెల్లవనుకో ఆయన చట్టంలోని ఏదో కిటుకు పట్టి కొత్త మెలిక పెట్టి కోర్ట్ లో నీ కేసు వాదిస్తాడు, గెలుస్తాడు. అయితే పెద్ద లాయరుకి పెద్ద ఫీజు ఇవ్వాలి.

ఇక్కడ నీ సద్గురు స్వామీజీని నీకు లాయర్. నీ భయం అనే సమస్యను పరిష్కరించటానికి ఆయన ఏదో ఒక కొత్త కిటుకు వెతుకుతాడు. కానీ ఇక్కడ జడ్జి యమధర్మరాజు. సద్గురువు ఆ యమధర్మరాజు దెగ్గిర అప్పీల్ చేసి, కొత్త లా పాయింట్ లేవదీసి, నీకు మరణ శిక్ష పడకుండా వాదిస్తాడు. గెలుస్తాడు.

అందువల్లే మీలో అనేక మందికి జీవితం పొడిగింప బడిన అనుభవాలు కలిగెయి. ఇంకా కలుగుతాయి. మరి, ఇందుకు మీరు ఇవ్వవలసిన ఫీజు ఏమిటి? శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు! ఇవే మీ సద్గురు కోరే ఫీజు!

నీకు మరణం వాయిదాపడుతుంది. ఇలా వాయిదా పడిన పొడిగింపబడిన జీవితం నువ్వు ఏమి చేస్తున్నావో గురువు జాగర్తగా గమనిస్తాడు. ఆ కాలంలో నీవు దైవ ధ్యానం, గురు సేవ, చెయ్యాలి. ఇదే ఫీజు. ఇది జరగకపోతే నీ జీవితపు పొడిగింపు ఆగిపోక తప్పదు.

కొందరు రక్షణ దొరికే దాకా వెంటబడి తిరుగుతారు. రక్షణ దొరికేక, ఇక తమ పనులలో పడి స్వామిజి దెగ్గిరకు రావటానికి తీరికే లేదు అంటారు. నీ పనుల్లో నీవు పడేందుకు కాదు నీకు రక్షణ ఇచ్చింది. ఆ మాట నీకు తెలియక పొతే నీకు దెబ్బ తగలక తప్పదు.

మామూలు ఫీజు కి, సద్గురువు తీసుకొనే ఫీజు కి మరో వ్యత్యాసం ఉంది. నీ జీవితపు పొడిగించిన సమయం లో నువ్వు సత్కర్మ చేస్తే నీకు సాక్షాత్తుగా జీవన్ముక్తి లభిస్తుంది! ఇది మీరు మరవ రాదు.

మిమల్ని చూసి చూసి ఈ మధ్య స్వామిజి తన పధ్ధతి మార్చు కున్నారు. నీ అప్లికేషన్ ఫుల్లుప్ చేయించేందుకే నీ చేతే కొన్ని సత్కర్మలు చేయిస్తున్నారు. ఆపైన నీవు సమాజానికి గాని ఆశ్రమానికి గాని పనికి వస్తావా అని అలోచించి మాత్రమే అభయం ఇస్తున్నారు. ఇది గుర్తుకు ఉంచుకోండి.

(భక్తిమాల ఏప్రిల్ 1991)

Tags: