SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
అఖండ శక్తి-

సూర్యుడ్ని గుప్పిటిలో బిగించుకోవడం సాధ్యం కాదు. కొందరు స్వామీజీకి సేవ చేసేరు గనుక, స్వామిజి కి దెగ్గిర అయ్యేరు కనుక వారు స్వామిజిమీద తమ పలుకుబడిని ఉపయోగిద్దామనో, లేదా స్వామీజీని తమ అభీష్టాల మేరకు ఉపయోగించుకొందామనో భావిస్తూ- వాళ్ళు నిశ్చయం గా సూర్యుడ్ని తమ గుప్పిటిలో బిగించుకోవాలని చూస్తున్నారన్నమాట. అది యెంత తెలివో మీరే ఆలోచించుకోండి.

మరి కొందరికి- ముఖ్యం గా పాత భక్తులకు మరో వింత సందేహం కలుగుతూ ఉండ్తుంది. భక్తులను అనుగ్రహించి, అనుగ్రహించి స్వామిజిలో శక్తి క్రమంగా తగ్గిపోతుంది అని!

వీళ్ళ లెక్కయేమిటి? విజ్ఞాన శాస్త్ర వేత్తలే కొందరు ‘శక్తి ప్రసారం చేసి చేసి సూర్యుడు క్రమంగా చల్లపడిపోతున్నాడు’ అంటున్నారు. ‘ఇలా సూర్య బింబం పూర్తిగా చల్ల పడి కొంత కాలానికి తన ఆకర్షణా శక్తి తగ్గిపోతుంది. దాంతో ఆకాశ మండలం లో గ్రహాల సమతూకం దెబ్బతిని, ఒకదానితో మరి ఒకటి కొట్ట్టుకొని ప్రళయం సంభవిస్తుంది’ - అని సిద్ధాంతాలు చెప్తున్నారు. అక్కడితో ఆగక ఇన్ని వేల సంవత్సరాలలో ప్రళయం వస్తుందని లెక్కలు చెప్తున్నారు.

ఇలాంటి శాస్త్రజ్ఞులకు శక్తి ప్రసారం యొక్క తత్త్వమే తెలియదు. శక్తి అంటే అగ్ని. అగ్ని ఏ వస్తునైనా కాలిస్తే అది బూడిద అవుతుంది. ఆ అగ్ని ఇంకా తీవ్రమైతే ఆ బూడిద వాయు అవుతుంది. ఆ శక్తి ఇంకా తీవ్రమైతే ఆ వాయువు మల్లి శక్తిగా మారిపోతుంది.

ఈ బ్రహ్మాండ గోళం లో ఒక్క ప్రాక్క్కన సూర్యుడు తన కిరణాలనే జ్వాలలద్వారా శక్తిని ఆయా గోళాలకు ప్రసరిస్తున్నాడు. అదే సమయంలో అనేక గోళాల లోని వాయు పదార్థాలను శక్తిగా మార్చి తాను తీసుకుంటున్నాడు. ఇక సూర్యుడిలోని శక్తి హరించుకుపోయి ప్రశ్న ఎలా పుడుతుంది? దానివల్ల ప్రళయం రావడం సాధ్యమా?

ఇక సద్గురు విషయానికి వస్తే- స్వామిజి తన భక్తులకు ఇచ్చేది ప్రేమ. మాతృప్రేమ! ఇది మీలో చాలా మందికి అనుభవంలో వచ్చిన విషయమే. పిల్లలకు ప్రేమ పంచడం వాళ్ళ తల్లికి ప్రేమ తగ్గుతుందా? అదీగాక స్వామిజి శక్తి అనంతమయినది. అది అఖండ శక్తి.

మహాభారతం లో పాండవులు అరణ్యంలో ఉన్నపుడు సూర్య భగవానుడు వాళ్లకి ఒక అక్షయ పాత్ర ఇచ్చేడు. స్వామిజి కరుణ కూడా అలాంటిదే. మీరు తినండి ఇంకొకరికి పెట్టండి. ఎంతమంది తిన్నా అది తరగదు. ఇక పని అయిపోయిందని పక్కన విసిరేస్తే, ఒక్క గింజ కూడా రాదు.

అయితే, స్వామిజీగారు ఒక్కక్కసారి అలసిపోయినట్టు కనిపిస్తారు ఎందుకు? - అంటే అది భౌతిక శరీర లక్షణం. భౌతిక శరీర అలసినట్టు కనిపించే సమయంలో కూడా ఆ శక్తి మాత్రం యవ్వోనోత్సాహంతో నిత్యా నూతనంగా ఉంటుంది.

అలాగయితే స్వామిజి శక్తి మాకు ఈ మధ్య సరిగ్గా అనుభవంలోకి రావటంలేదు - ఎందుకు- అని కొందరు గందరగోళం పాడుతారు.

నీ ఇంట్లో బల్బ్ వెలుగకపోతే ఎలక్ట్రిసిటీ లో శక్తి తగ్గిపోయింది అని అన్నావు కాదా? కనెక్షన్ లో ఎక్కడైనా తేడా వచ్చిందా అని పరిశీలిస్తావు. అలాగే నీకు స్వామిజి అనుభవం రావటంలేదు అంటే నీలో ఎక్కడో కనెక్షన్ తగ్గిందన్నమాట.

మనసులో కలతలు, ఆలోచనలు, అన్ని ఎక్కు అయినప్పుడు బుద్ధి దెబ్బ తింటుంది. దానిని సద్గురువే రిపేర్ చెయ్యగలడు. అదే ఆశ్రయించడం అంటే . ఆయన యందు భక్తి విశ్వాసాలు నువ్వు ఇవ్వ వలసిన ఫీజు. అది ఒక్కటే సరిపోదు. వచ్చిన మెకానిక్ నే గౌరవించాలి. నీ నిస్స్వార్థ బుద్ధి నీ గౌరవం.

నిస్స్వార్ధమైన భక్తి, విశ్వాసాలు గల భక్తులకు ఆవగింజంతైనా నష్టం కలగదు. చంచల బుద్ధితో సగం సగం విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఒక పక్క తాము నష్టపోతూ ఇంకో పక్క స్వామీజీకి భాద్యతలు పెంచుతూ పోతారు.

న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా? అలాగే మీ గురుశ్చక్తి యొక్క తీవ్రతను బట్టి, మీకు కలిగే అనుగ్రహం యొక్క పరిమితి మారుతూ ఉంటుంది.

ఈ రకమైన అవగాహన లేకపోతె మీకు స్వామిజి అర్థం కారు. ఆశ్రమ కార్యక్రమాలు అర్థం కావు. స్వామిజి సాధారణ వ్యక్తి కాదు, ఆయన సూర్యగోళం లాంటి వారు. అగ్ని శిఖా వంటి వారు.

(భక్తిమాల మార్చ్ 1991)

Tags: