SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
అందం

ఎవరితోనూ సంబంధం పెట్టుకొరాదు. కానీ, అది సాధ్యం కానప్పుడు సత్పురుషులతో సాంగత్యం చెయ్యాలి. సాంగత్య దోషానికి సత్పురుషులు ఔషధీ.

పూర్వం, పురూరవుడనే రాజు అందానికి మెచ్చి ఊర్వశి అనే దేవకన్య స్వర్గం వదిలి అతనిని వివాహమాడింది. ఈ వార్తా విన్న దేవా వైద్యులు అంటే అశ్విని కుమారులు, పురూరవుడి అందం చూడడానికి భూలోకానికి వచ్చేరు. ఆ సమయానికి ఒంటికి నుని రాసుకొని వ్యాయామం చేస్తున్నాడు పురూరవుడు. సిగ్గు పడుతున్న పురూరవుడిని బాగా పరిశీలించి, దేవ వైద్యులు, ‘ఓ రాజా! పూర్తిగా అలంకరించుకొని మల్లి వచ్చి కనిపించు’- అన్నారు.

ఈ మాటి బాగా అలంకరించుకొని బయటకు వచ్చిన రాజును చూసి వెటకారంగా నవ్వేరు దేవతలు. ఆశ్చర్యపడ్డాడు రాజు. అప్పుడు వారు అన్నారు, ‘ఓ రాజా! మానవులు బాల్యంలోనుంచి, యవ్వనంలోకి, వార్ధక్యంలోకి మారుతారని అందరికి తెలుసు. అయితే, ప్రతి నిమిషంలోనూ లక్షల భాగంలోనూ ఈ మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఇది సూక్ష్మ దృష్టి ఉన్నవారు మాత్రమే గ్రహించగలరు. ఈ మార్పే నిజం. నిన్ను ఒక జాము క్రిందట చూసేము. ఇంతలో నీలో ఇంత మార్పు (అనగా నాశం) వచ్చిందా, అని మేము ఆశ్చర్య పోతుంటే, నువ్వేమో ఇప్పుడు ఇంకా బాగున్నాను అని గర్విస్తున్నావు. అందుకే మేము నవ్వేము’- అన్నారు.

ఇది వినేసరికి పురూరవుడిలో గొప్ప మార్పు వచ్చింది. ‘క్షణ క్షణానికి నశించిపోతున్న మానవుడు ఇతర వస్తువులను శాశ్వతంగా పట్టుకొవాలని ప్రయత్నిస్తూ ఉంటాడే. కానీ, మృత్యువు దెగ్గిరికి వెళ్తున్నాడు అని మర్చిపోతాడు’.

ఈ జ్ఞానోదయం వల్ల అతడు సౌందర్య గర్వాన్ని, ఊర్వశి మొహాన్ని వదిలి సన్మార్గాన్ని పట్టుకున్నాడు.

చూసేరా? కొద్దీ క్షణాల సత్పురుషుల సాగత్యాం తో యెంత మార్పు వచ్చిందో పురూరవుడిలో? అందుకే సాంగత్యానికి సత్పురుషులే ఔషధీ అన్నారు పెద్దలు.

దత్త దర్శనం లో అలర్క కథ సాంగత్య దోష గురించి తెలుపుతుంది. అలర్కుడి విషయం లో సద్గురు దత్తతేయుడి సాంగత్యం వలన ఔషధీ ఇంకా వేగంగా పనిచేసింది.

(భక్తిమాల ఫెబ్రవరి 1991)

Tags: