గ్రిహస్థాశ్రమములో మానవుడి కష్టాలకి కారణం ఏమిటి? అంటే వాడు చిత్తమును భగవంతునిపై నిలపకపోవడంమే! దీని మూలంగా దుఃఖాలు వస్తాయి.
సంసారం అనేడి ఒక సముద్రం. ఇది ఆశ అనే అలలతో, మన్మథుడు అనే వాయు చేత వృద్ధి చేయబడిన మోహముతో, విషయవాసనలు అనే సర్పముతో, భార్య అనే సుడితో , పుత్రులు అనే మొసళ్ళతో కూడి మహాభయంకరమైనదిగా ఉంటుంది . అట్టి మహాసముద్రం దాటుటకై అసాధ్యం.
భార్యాపుత్రులతో కలిసి గృహుములో నివసించడమే సంసారమని, అది లేనిమాత్ర విరాగుడని భావించరాదు. సంసారంలో ఉంటూ కూడా, కుమ్మరిపురుగు లాగ ఏమి అంటక, వైరాగ్యాదులతో జ్ఞానముపొంది లోకములో ఉత్తమ కీర్తి సంపాదించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు.
మనలో అహంకార మమకారాలు ఉండేంతవరకు పరమాత్ముడు మన హృదయంలో నివసించడు . అందుకే బుద్ధిమంతుడు, ఈ మమకార అహంకారాలను పారద్రోలి, తన హృదయాన్ని పరమాత్మకు ఆలయం గా చేస్తాడు. శాంతి, షమ, దమనాదులచే ఆ ఆలయాన్ని శుద్ధి చేసి అందులో భగవంతుడిని ప్రతిష్ఠ చేస్తాడు. అహింస మొదలైన ఎనిమిది పుష్పాలతో ఆ భగవంతుడిని అత్యంత ప్రీతితో పూజ చేస్తాడు.
(తెలుగు భక్తిమాల ఆగష్టు 1980)