అహింసా ప్రథమం పుష్పం పుష్పంఇంద్రియ నిగ్రహః
సర్వభూదాయా పుష్పం క్షమాపుష్పం విచేక్షతః
శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తథైవచ
సత్య మాష్టవిధం పుష్పం విణో ప్రీతికరం భవేత్
-
అహింసా పుష్పం : ఇది మొదటి పుష్పం. అహింసా అంటే శారీరకంగా గాని, మానసికముగా గాని, వచనాలతో గాని ఇతరులను నొప్పించకుండా ఉండడము.
-
ఇంద్రియ నిగ్రహము: ఇది రెండో పుష్పం. ఇంద్రియ నిగ్రహము అంటే బాహ్యేంద్రియములు, అంతెంద్రియములు అన్నిటిని నిగ్రహించడము. దానితో పాటు మనస్సును, శుచిగా, శాంతిగా ఉంచడము.
-
సర్వభూతదయా పుష్పం : అంటే సమస్త ప్రపంచమునందు సమస్త ప్రాణికోటి యందు దయా కలిగి ఉండడము. బీదవాడు, భిక్షకుడు, యోగి- ఎవరైనా సరే- ఆకలితో భాదపడుతుంటే వానికి ప్రేమతో తన శక్తి కొలది ఆదరించడం.
-
క్షమా పుష్పం: అనగా తనకి ఒకడు అపకారం చేసినప్పుడు, వాని యందు క్రోధము లేక శాంతిగా ఉండడం
-
శాంతి పుష్పం: అంటే ఎన్ని కష్టాలు దుఃఖాలు వచ్చినా శాంతము గా ఉండడము.
-
తపః పుష్పం: అంటే సర్వకాల, సర్వావస్తులలోను తానూ ఏ కార్యము చేస్తునను మనస్సును భగవంతుడిపై నిలపడము.
-
ధ్యాన పుష్పం: అంటే బ్రహ్మ నిష్ఠతో కూర్చున్నపుడు మనస్సును అంతర్ ముఖము చేసి, ఏకాగ్రత కలవాడై స్వస్వరూపసంధానము చెయ్యడం.
-
సత్య పుష్పం: అంటే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని మానావమానాలకు లోబడినా నిజాము పలకడం.
ఈ ఎనిమిది పుష్పములుచే పూజిస్తే విష్ణు మానస పూజ అనబడును.
(తెలుగు భక్తిమాల సెప్టెంబర్ 1980)