పూజ అంటే ఏమిటి? పూజ అంటే పరిచయము. భగవంతుడితో సంబంధము కలుగుచేసుకోవడం అని అర్థం. ఒకరు ఇంకొకరితో మాటలాడే ముందు నమస్కారము చెయ్యాలి అని పురాణాలలో ఉంది. అలాగే భగవద్ శక్తి తో సంబంధం పెంచుకునే ముందు పూజ చెయ్యాలి.
ఈ పంచభూతములు పూజాద్రవ్యాలతో ఐక్యం అయి ఉన్నాయి. అగ్ని నూనిదీపం మందు ఐక్యం; గాలి ధూపము నందు ఐక్యం; భూమి వ్యక్తి కూర్చున్న స్థలం పై; నీరు అభిషేకములు అర్పించటంలో ఐక్యం అయి ఉంది. భూమి రూపము లేనిది. మొరిగే గంట భక్తులను వారి ప్రాపంచిక చింతలునుండి మేల్కొలుపుతుంది. మరి దుష్ట శక్తులను ప్రారదోలుతుంది. గంట భగవంతుని పూజకు ఆహ్వానించును.
మంత్రము ప్రత్యేకముగా ముఖ్యమైనది. ఆ బీజాక్షరములు పూజకు శక్తినిస్తాయి.
పూజ మరియు హోమము దర్శించేవారికే కాక ప్రజానీకమున అంతటికి శ్రేయస్కరము. ఈ కర్మాచరణ ఆత్మా శాక్షాత్కారము పొందుటకు సహాయపడుతుంది.
పంచామృతము ఔషధీ గుణములతో కలిగి ఉంటుంది. పాలు చర్మ వ్యాధులను నివారిస్తుంది. పెరుగు నరముల రోగమును నశింప చేస్తుంది. తేనే మనుషుని యూవ్వనత్వము పెంచు తుంది. పంచదార జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేస్తుంది. కానీ ఈ పంచామృతమును ప్రసాదము గానే కొంచమే తీసుకోవాలి.
కుంకుమ జ్యోతిష శాస్త్రములో ప్రధానమైన గ్రహముల విషయము తెలిసికొని శక్తి మనిషిలో అభివృద్ధి చేస్తుంది. బియ్యముతో కలిపినా కుంకుమ మన ముందు సంతతి వారికి శుభమును సూచిస్తుంది.
నీరు బాహ్య, అంతర్గత దేహమును, మనస్సును సూచి చేయుటకు ఉపయోగ పడుతుంది.
ఫలము భక్తుని హ్రదయమును భగవంతునికి అర్పించుట; పుష్పము మనసును అర్పించుటను సూచిస్తాయి. నీరు భక్తుని యొక్క నిజమైన భక్తితో కూడిన అశ్రువులను సోచిస్తాయి. గంట నాలుకకు సమానం.
కొబ్బరికాయ ప్రత్యేక అర్థం కలిగి ఉంది. కొబ్బరికాయ విరుచుట అంటే భక్తుడు తన దేహమును, మనస్సును తెరచుట, మరియు అంతము భగవంతునికి అర్పించుటను సూచిస్తాయి. కొబ్బరికాయ లో నీరు జ్ఞానానికి సంకేతం. అందులోని తెల్లని గుజ్జు ప్రాపంచిక చింతలు నశించిన తరువాత భక్తుని మానస్ శుద్ధిని సూచిస్తుంది. కొబ్బరికాయ విరచుట అంటే భక్తుడు ఆ ప్రాపంచిక బంధాలను తెంచుట అని అర్థం.
కర్పూర హారతి పూర్తిగా మండవేయబడుతుంది. అట్లే భక్తుడు తాను చేసిన పాపము కించిత్ అయినా మిగలకుండా హరింప చేయమని భగవంతుడిని ప్రార్థిస్తాడు.. ఆ మండుతున్న కర్పూరము అందరికి చూపిస్తారు. దీనితో ఆ జనులు తాము చేసిన పాపాలని క్షమింప చెయ్యమని ప్రార్థిస్తారు. హారతి తరువాత భక్తుడు సాష్టాంగ నమస్కారము, ఆత్మా ప్రదక్షిణము చేస్తాడు. దీనితో పరమాత్ముడు అన్ని వైపులా ఉన్నాడని, అన్ని చోట్ల దర్శనము లభించవచ్చు అని భావిస్తాడు.
పూజ తరువాత తీర్థం అందరికి ఇవ్వబడుతుంది. ఆ పంచామృతములో ఔషధీ గుణాలు అందరికి చేరాలి అని ఉద్ద్యేశం.
పూజ మరియు హోమం లో ముందు కర్మ యోగం, తరువాత భక్తి యోగం మరి జ్ఞాన యోగం కలిసి ఉన్నాయి.
(తెలుగు భక్తిమాల నవంబర్ 1980)