SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 08 Jul 2019
ఏ వరం కోరాలి?

కొందరు భగవంతుడిని పరీక్షించడాని కోసం వరం కోరుతారు. ఇది తప్పు. కొందరు తనకు అసలే కష్టము కలగరాదని కోరుతారు. ఇలా కోరేవారికి దుష్కర్మ అంతా ఒక చోట మిగిలిపోయి, పెరిగిపోయి, ఎప్పుడో ఒకనాడు మొత్తం విరుచుకు మీద పడుతుంది.

భగవంతుడు గాని, గురువు గాని, నీ కర్మను పూర్తిగా తీయ్యలేరు. నీ కర్మ నీ మీద విరుచుకు పడ్డ రోజున, గురువుని తిడతావు నువ్వు. దానివల్ల నీ పాపం మరింత పెరుగుతుంది.

దీనికంతకు కారణం- అసలు కష్టమే వద్దనుకోవడం.

మరి అయితే యేమని కోరాలి? ‘నీకు నచ్చిందివ్వు’ అని కోరాలి. అది చేతగాకపోతే, ‘సుఖం లో మరుపులేకుండాను, కష్టం లో ధైర్యం ఉండేటట్లుగానూ అనుగ్రహించు’ అని కోరాలి. జాగర్తగా ప్రార్థించడం అంటే, పై చెప్పిన రెండు విధానాలలో ఏదో ఒక విధం లో ప్రార్థించడం.

ఈ రెండిని కలిపినా ప్రార్థన ఒకటి ఉంది. ‘నాకు ఏమి తెలియదు. నీకు తోచింది ఇవ్వు. నీ బలం వల్ల అన్ని భరించేస్తాను’. నిజానికి ఇదే తేలిక. ఇదే మంచిది కూడా. లోకం లో చాలా మందికి సద్గురువు లేడు . కానీ దుఃఖాలు ఉన్నాయి. మీకు గురువు ఉన్నాడు, దుఃఖాలు ఉన్నాయి. ఇదే మేలు.

గురువు దొరకటమే అదృష్టం. ఇదొక పడవ. దీనికి నాయకుడు గురు. ఈ నాయకుడికి ప్రయాణికులు గోల చెయ్యడం గిట్టదు. గురువు మీద ప్రేమతోనే మీరు ఆయనతో మాటలాడుతూ ఉంటారు. దీని వల్ల మీ పక్క వారు చెడిపోతారు. ఆ పాపం మీదే! మౌనం గా ఉండండి. ఆయనకు మీ పుస్తక జ్ఞానం తో పనిలేదు. ఆయనను ఇతర గురువులతో పోల్చకండి. ఈ డ్రైవింగ్ విధానమే వేరు. ఇది వేగం ఎక్కువ. ఇది బాగా నడపగలడు అని గురువు మీద మీకు నమ్మకం ఉండాలి.

నమ్మక్కమ్ తో పడవ లో మౌనం గా ఉండు. సేవ చెయ్యి. నమ్మక్కమ్ లేకపోతె వెళ్ళిపో.

‘ఓ గురుదేవ! నా దెగ్గిర జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు. నువ్వే శరణం. నీవెవ్వరో నాకు తెలియదు. నన్ను ఎటు తీసుకు పోతావో నాకు తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు స్వర్గానికి పొతే నన్ను అక్కడికి తీసుకుపో. నువ్వు నరకాన్ని వెళ్తే నేను అక్కడికి వస్తాను’ -అని ప్రార్థించాలి. అంత నమ్మక్కమ్ ఉండాలి. ఈ పడవ లో కూర్చున్నవారిలో కొంతమంది ఒకటవ తరగతి లో ఉన్న్నారు . మరి కొందరు రెండవ తరగతి లో ఉన్నారు. ఎవరు ఏ తరగతి అయితే నీకేమి? పడవ నడుస్తోంది. నువ్వు అందులో ఉంటె చాలు.

(భక్తిమాల సెప్టెంబర్ 1991)

Tags: