ఓ గణేశ్వర! సముద్రాన్ని, నదులను, భూమిని, ఆకాశాన్ని, ప్రజలను, పశువులను, నక్షత్రాలను, అన్ని గ్రహాలను రక్షించు, రక్షించు- అని ప్రార్థించవలసిన రోజు ఈ రోజు.
ఈ రోజు గణపతి దేవుడి పుట్టినరోజు. గణపతి ప్రకృతి స్వరూపుడు. ఈ పర్వ దినాన్ని సకల లోక వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమితానందాల తోను జరుపుకుంటారు. ఎందుకంటె గణపతి స్వామి నాయకులందరికీ నాయకుడు! వినాయకుడు!
ఆయన అందరి దుఃఖాలను పోగొడుతాడు. చక్కని విద్యను ఇస్తాడు. మంచి బుద్ధిని ఇస్తాడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.
అందుచేత, విద్యకోసం విద్యార్థులు, జ్ఞానం కోసం పెద్దలు స్వామిని ఆరాధించాలి.
పూర్వం పార్వతీదేవిని పరబ్రహ్మ అయినా శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకొని ఆయనను తనకు పుత్రుడిగా పుట్టమని కోరుకుంది. ఆ తల్లి కోరిక ప్రకారమే పరబ్రహ్మ అయినా శ్రీకృష్ణుడు గణపతి గా పుట్టేది బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది.
గణపతి స్వామి సర్వ వ్యాపక శక్తులకు, సర్వ గణాలకు ప్రభువు. ఆది దేవత అయి ఉన్నాడు. లింగ, శివ, మత్స్య,స్కాంద , వరాహ, పద్మ, భవిష్యత్ పురాణాలలో గణపతి దేవుని యొక్క పుట్టుక గురించిన విశేషాలు చెప్పబడ్డాయి.
వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఈ రోజున భక్తి, శ్రద్ధలతో ఆచరించండి. ప్రకృతిలో లభించిన 21 రకాల పత్రాలతో స్వామిని పూజించండి. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. గరిక తో అర్చించండి. వ్రాత కథ విని అక్షతలు శిరస్సున ధరించండి. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు నిందలు రావు ఎప్పటికి కూడా. స్వామి బాగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.
మొదటిగా స్వామి తన రూపం తో ఆనందాన్ని కలిగించి, తన భక్తుడిగా తీసుకొని నవ్వుతూ జీవితం గడిపేలాగా చేస్తాడు. బాధలు కంటే మనము అధికమించేలాగా చూస్తాడు. అంటే, దానికంటే పైకి వెళ్లే లాగ చూస్తాడు. సోమారితనాన్ని, గర్వాన్ని తొలగించి సత్త్వ గుణాన్ని ప్రసాదిస్తాడు.
అంతటి స్వామిని సంకష్టి చతుర్థి నాడు చంద్రుడు ఉదయించే వేళలో పూజించండి. కష్టాలు తొలిగిపోతాయి.
గణపతి దేవుడు అశీసులతో మీ వ్యాపారాదులు బాగుంటాయి. వ్రతాలు, నోములు ఫలిస్తాయి. పనులు బాగా నెరవేరుతాయి. మీ నియమ నిష్టలు సాధిస్తాయి.
కష్టపడితే సుఖం కలుగుతోంది; కష్టపడకపోతే దుఃఖం కలుగుతుంది. ఇలాగ రెండిటికి కష్టమే కారణం అయుంటుంది అని గ్రహించి స్వామి విఘ్నాధిపతి అయ్యేడు.
విఘ్నేశ్వరుడిగా విఘ్నాలను తొలగించే వాడిగాను, చెడు పనులకు విఘనాలను కలిగించేవాడిగాను కీర్తించబడుతున్నాడు.
స్వామి మూలాధార చక్రం వద్ద కూర్చొని శక్తిని ప్రేరేపిస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆ మహోదర స్వామికి అల్ప నైవేద్యాన్ని సమర్పించండి. ఆ స్వామి సంతృప్తి చెంది మిమ్మల్ని ఆదుకుంటాడు.
స్వామి కి అమ్మవారితో అభేదము. అమ్మవారికి వాహనం సింహం అయితే, ఒక కల్పం లో గణపతి కి కూడా వాహనం సింహం ఏ ఉండింది. అందుచేతే స్వామి ‘ఓం సింహవాహనాయ నమః’ అని కీర్తించబడ్డాడు.
స్వామి కి శివుడితో అభేదము. తండ్రి లాగానే వ్యాఘ్ర చర్మాన్ని చుట్టుకున్నాడు. సర్పాన్ని ఆభరణం గాను ధరించేడు. ప్రమాదాలను,అకాల మృత్యువును తొలిగించే మృత్యుంజయ రూపుడై ఉన్నాడు.
పరమాత్మను ఆదిత్య మండలం లోను హిరణ్మయ పురుషిడుగాను ఉపాసిస్తారు. స్వామి పరమాత్మ స్వరూపుడై ఉన్నాడు. కనుకనే ‘ఓం సూర్య మండల మధ్యగాయ నమః’ అని కీర్తించ బడుతున్నాడు.
ఇలా గణపతి స్వామి సర్వ దేవతా స్వరూపుడై ఉన్నాడు. పరబ్రహ్మమై ఉన్నాడు. కనుక గణపతి దేవుడ్నిపూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుంది. ఆ దేవతల అనుగ్రహం కూడా దక్కుతుంది.
భాద్రపద మాసం లో వర్ష ఋతువు వస్తుంది గదా? వర్షాకాలాల్లో వచ్చే రోగాలు స్వామి కి చేసే పత్ర పూజలతో తొలిగిపోతాయి. అందుకే గణపతి స్వామి ఆకులుతో నన్ను పూజించండి అని తన వ్రాత కల్పం లో ఏకవింశతి పాత్ర పూజను నియమం గా పెట్టేడు.
స్వామి ప్రకృతి మాత పుత్రుడు కదా?ఆయనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం కదా? ప్రకృతి లో లభించే సహజ సిద్దమైన పదార్థాలను ఆయనకు నైవేద్యం గా సమర్పించండి. స్వామి తృప్తి చెంది ప్రకృతిలోని లోటుపాట్లను సరిచేసి ప్రపంచానికి లాభాన్ని సమకూరుస్తాడు.
స్వామి, అరిషడ్వార్గాల ఆటలను అరికట్టి, దురాలోచలను తొలిగించి సదాలోచలను కలిగిస్తాడు. చెడ్డ యోచనలు తొలిగిస్తాడు. రాగ ద్వేషాలు ఎక్కు అవకుండా చేసి ధర్మ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాడు. సత్కార్యాలు పట్ల ఆశక్తిని కలిగిస్తాడు. గణపతి దేవుడి అనుగ్రహం విఘ్నాలు తొలిగి మీకు శుభాలు చేకూరగాక. అని ఆశీర్వదిస్తూ,
ఓం గేమ్ గణపతయే నమః
(వినయ చవితి ఆగష్టు 2018- )