SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 08 Jul 2019
నిజమైన జ్ఞానం ఏమిటి?

ప్రాణులన్నీ ఏదో ఒక పని చేస్తూ ఉంటాయి. కనుక వాటికి ఎంతోకొంత జ్ఞానం ఉన్నట్లే. అయితే, కొత్తగా జ్ఞానాన్ని సంపాదించటం వాటివల్ల కాదు. ఎందుకంటె జ్ఞాన సంపాదనకు కావలసినది- బుద్ధి. అది మనిషికి మాత్రమే ఉంది.

అందువల్లే, జ్ఞాన సంపాదనం మనిషికి గల ప్రత్యేకత! అది దాటరాని విధి కూడా!

నిజానికి మానవుడిలో దాగి ఉన్న తత్త్వాన్ని ఆవిష్కరించడమే నిజమైన జ్ఞానం! అదే మానవ జీవితానికి పరమార్థం! దీని పేరే మోక్షం. అది అఖండ ఆనంద స్థితి. ఈ స్థితి మనో బుద్ధులకు అందనిది. ఇది వివిరణకు లొంగనిది; ఇది ఒక నిత్యా దివ్య స్థితి.

ప్రతిమానవుడు ఈ మోక్ష స్థితిని ఈ జన్మలోనే, ఇప్పుడే అందుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఇది సులభం కాదేమోగాని, అసంభవం కాదు! మోక్షం కావాలి అని కోరుకున్న మాత్రాన్న, అది దొరకదు. దానికి కృషి, సద్గురు కృప- రెండూ ఉండాలి.

కావున, సద్గురువును కేవలం జ్ఞానం కోసమే ప్రార్థించండి.

(భక్తిమాల జులై 1991)

Tags: