మనది మానవ జన్మ. ఈ జన్మ అత్యంత పవిత్రమయినది. కానీ ఈ జన్మ లోనే కామ, క్రోధ, మోహ, లోభ, మద , మాత్సర్యాలు మన వెంట పడుతాయి. పశుపక్ష్యాదుల వలే కేవలము ఆహార నిద్రాదులను ప్రధానంగా భావించి పశు రూపాన్ని పొందుదురే గాని జ్ఞానము పొందరు.
ఈ కామ క్రోధాదులు మనకి అంతఃశత్రువులు. అందుకే వీటిని శాస్త్రకారులు అరిషడ్వార్గాలని పిలుస్తారు. ఇవి క్రమక్రమంగా జయించు కొలది మనిషి అజ్ఞానమును విడిచి సుజ్ఞానము వేపు వెళ్తాడు.
జ్ఞాని సర్వజన పూజ్యుడు. అజ్ఞాని అందరిలో అథముడు. తాను అజ్ఞాని అయి పశురూపియై ఉంటాడో లేక సుజ్ఞానియై సర్వజన పూజ్యుడు అవుతాడో- అది వారివారి చేతులలో ఉంది.
సద్గురువును ఆశ్రయించి అరిషడ్వార్గాలను తొలిగించుకొని సుజ్ఞాని అవుటకై పూజలు, సజ్జన సహవాసము, సద్గురు సేవ, మొదలైనవి మన పూర్వీకులు విధిగా నిర్ణయించేరు.
(తెలుగు భక్తిమాల జూన్ 1980)