SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 27 Jun 2019
వేదాలు మొదలైన గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి

మనము వేదాలు మొదలైన గ్రంథాలు అపార్థము చేసుకొని వాటిని దూషిస్తాము. ఆ దూషణ వల్ల మరింత పాపపీడితులు అవుతాము. ఏ శాస్త్రమైన దృక్పధం ఉంటె సరియైన అవగాహన ఉంటుంది. పురుష సూక్తం లో ‘బ్రాహ్మణో ముఖైస్కే.. శూద్రో పాదౌ’ అన్న శ్లోకానికి విష్ణుముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువులనుంచి క్షత్రియులు, ఉదరం నుంచి వైశ్యులు మరి పాదము నుంచి శూద్రులు ఉద్భవించారుఅని.

దానికి సరిగ్గా అర్థం చెప్పాలంటే, శరీరం లో 4 భాగాలు సరిగ్గా పని నిర్వర్తించుకున్నప్పుడు మాత్రమే ఆ శరీరం దృడంగా పటుత్వం గా ఉంటుంది. అలాకాక ఆ శరీరపు భాగాలు తమ నిర్జిత పనులు మార్చుకున్నా, సరిగ్గా చెయ్యకపోయిన, ఆ శరీరం రోగ గ్రస్తం అవుతుంది.

బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టేరంటే వారు బ్రహ్మతేజస్సు కలిగిఉండి యజ్ఞ యాగాదులను అనుసరిస్తూ నిస్స్వార్థ మైన మేధాశక్తి కలిగి ఉండాలని అర్థం. అలాగే బాహువుల నుంచి జన్మించిన క్షత్రియులు బలమునకు చిహ్నం. వారు ఈ శక్తి, దేశ సేవకు, దేశ రక్షణకు, పీడిత జన ఉద్ధరణకు ఉపయోగించాలి అని అర్థం. అలాకాక స్వార్థం కోసం ఉపయోగిస్తే అది దురుపయోగం అవుతుంది.

ఉదరం నుంచి వైషులు పుట్టేరంటే పొట్టపోషణకై వ్యాపారవృత్తి చెయ్యాలని, అది నిస్స్వార్థం గా సాంఘిక ప్రయోజనకోసం ఉండాలని అర్థం. అలాగే పాదాలనుంచి శూద్రులు పుట్టేరంటే పాదములు లేనిదే మనిషి ఎలా కదలలేడో , నిలబడలేడో అలాగే వాళ్లు లేని దేశము పురోగమింపలేక ఈదుమూలపాలు కావచ్చు అని అర్థం. ఇందులో అన్ని వర్గములు వారు నిస్స్వార్థము గా పనిచేయాలి. అప్పుడే దేశము పురోగతము అవుతుంది.

బ్రహ్మతేజస్సుతో వేదపారాయణం యజ్ఞ యాగాదులు చేసేవాడే బ్రాహ్మణుడు. అలా చేయనివాడు జన్మతః బ్రాహ్మణుడైన కర్మరీత్యా కానందువలన నిజమైన బ్రాహ్మణుడు కాదు. అలాగే శూద్రుడు తన ధర్మమును నిర్వర్తిస్తూ మధ్య మాంసములను నిషేధిస్తే బ్రాహ్మణుడితో సమానము. అట్టి వానిని ఉపబ్రహ్మ అంటారు.

(తెలుగు భక్తిమాల ఏప్రిల్ 1980)

Tags: