లోకమునందుగల ప్రతిజీవుడు ఈశ్వర అంశతో పుట్టినవాడే. అలాగే, సమస్త దేవాధిదేవతలు కూడా ఈశ్వర అంశులుగానే భావించుచూ, అట్టి దేవతలా యొక్క ఋణము తీర్చకుండినచో జీవుడు తృప్తుడు కాజాలడు. ఈశ్వరాంశ నుండి వెలువడిన కళయే జీవుడు. కావున తన ఉత్పత్తి స్థానమగు ఈశ్వరుని చేరుటకు, విగ్రహ ఆరాధనే శ్రేష్ఠమయిన మార్గము. అట్టి మార్గమును అనుసరించి పూజ, ధ్యానోపాసనలు చేయడం ప్రతి మనువుని ధర్మమూ అని మహనీయులు, మహాత్ములు బోధించారు. ఇది అనేక వేదశాస్త్రములలో కూడా చెప్పిబడియున్నది.
మహనీయులు, మహాత్ములు, ఈ జీవులను ఉద్ధరించుటకొరకై, వేదం రహస్యములను, స్మృతులను,ధర్మశాస్త్రాలు పరతత్త్వ బోధలను నేర్పిస్తున్నారు. అజ్ఞానులకు మహోపకారం చేస్తున్నారు. అట్టి మహనీయులు స్వార్థపరులుగాక జీవుల యోగక్షేమములు కోరుచు పాఠములు నేర్పుతుంటారు. కావున సనాతనము అంటే ఆది నుండి సంప్రదాయముగ నేర్పరచిన ధర్మ మార్గము ఆదరించుటయే మానవునికి ధర్మమని తెలుసుకో.
(భక్తిమాల ఫెబ్ 1980)