పరమాత్మ సృష్టి ఒక లీల వినోదం గా ఉంది. ఆయన యొక్క లీల వినోదము ఆయనకే తెలుసును కానీ అల్ప జ్ఞానులకు మానవులకు ఎలా తెలుసును?
ఈ సృష్టి లో ఖేచరములు, జలచరములు, భూచరములు, వనచారములు మొదలుగా జీవులు ఎన్నో లక్షలు ఉన్నాయి. కానీ సమస్త జీవులను చూడుటకు, గుర్తించుటకు ఎవరికి సాధ్యము కాదు.
క్రిమి కీటకాలు -అంటే గసగస గింజ కన్నా చిన్న ప్రాణులలో కూడా అంతఃకరణం చలనమున్నది. అంతటి సూక్ష్మ శరీరము, కూడా ఇంద్రియాలు, మనస్సు వాటి తగిన జ్ఞానముతో గూడిఉండెను. అట్టి జీవి జంతువులూ కూడా తాము ఏనుగుకంటే పెద్దవిగా ఉన్నామని భావిస్తాయి. కానీ, అన్నిటియందును పరమాత్మ ఆత్మా స్వరూపుడై వ్యాపించి ప్రకాశిస్తున్నాడు.
ఇంకను భగవంతుని లీలలు అతి విచిత్రముగా ఉన్నాయి. పశు పక్షులలో అనేక రూపములుగాను, రంగులుగాను, అనేక రకములుగాను. కొన్ని క్రూర జంతువులుగాను, కొన్ని సుందరముగాను, శాంతముగాను, కొన్ని హింస జంతువులుగాను, కొన్ని చిన్నవిగాను, కొన్ని పెద్దవిగాను ఉన్నాయి. జలచరములలో పెద్ద తిమింగిలాలు, చిన్న చేపలు, అనేక రంగుల చేపలు గా కూడా ఉన్నాయి. అన్నిటిలోను పరమేశ్వరుడు ఆత్మా స్వరూపుడై నీవిసించి ఉన్నాడు.
(భక్తిమాల జాన్ 1979)