SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
ఈ ప్రపంచం అంతా ఓంకారం నుండే పుట్టింది

ఓ అమ్మ! నువ్వు ఓంకార రూపంలో ఉండి లోకాలన్నీ స్రిష్టిచేసి దేవతలందరికి అలంకారంగా ఉన్నావు. ఓ సంగీతరసిక! సప్తస్వరాలు నీవే. నాదాన్ని ఉద్భవింప చేసేది నీవే. నాద బిందు కాలాలకు అతీతంగా ఉన్నది నీవే.

ఎక్కడైనా మంత్రంగానే, నామావళిగాని చదువుతుంటే ముందు ‘ఓం’ అని వినిపిస్తుంది. శైవులకు వైష్ణవులకు పడదు అయినా ఇద్దరు తమ తమ మంత్రాలకు ముందు ఓం అనే అంటారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. పండితులు వేదాలు చదువుతున్నపుడు హరిః ఓం అని ప్రారంభిస్తారు. యజ్ఞాలు చేసేవారు బిగ్గరగా ఓం అని పలికి యజ్ఞం ప్రారంభిస్తారు.

అంతే కాదు. మన ప్రసిద్ధంగా ఉండే దేవతలందరు అలంకారాలతో ఓంకారాన్ని సూచిస్తారు. శివుడు దెగ్గిర ఢమరు, విష్ణు దెగ్గిర శంఖం, బ్రహ్మ దెగ్గిర హంస, ఆంజనేయుడి తోక- ఇవన్నీ ఓంకారానికి సంకేతాలే. మన దత్తాత్రేయుడి దెగ్గిర శంఖం, ఢమరు రెండు ఉన్నాయి. ఇక అమ్మవారిలో సరస్వతి దెగ్గిర వీణ ఉంది కదా! ఇవాళ్ళ నవరాత్రులలో సరస్వతి ప్రధాన దేవత.

ఇలా ఎక్కడ చూసిన ఓంకారం ఎందుకు ప్రధానంగా కనిపిస్తోంది? పంచదార చిలుకలో ముక్కు తిన్నా తీపి గానే ఉంటుంది, రెక్క తిన్న తీపిగానే ఉంటుంది. ఎందుకంటె ఆ చిలకంతా పంచదారే.

అలాగే, ఈ ప్రపంచం అంతా ఓంకారం నుండే పుట్టింది. కొందరు ఈ ప్రణవ నాదంలొంచి వేదాలు, నాదం మాత్రమే పుట్టెను అని అనుకుంటారు. కాదు. కొండలు, నదులు, పంచ భూతాలూ అన్ని ప్రణవం నించే పుట్టెయి .

కనుక, స్రిష్టి యొక్క తత్త్వం తెలియాలంటే ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి. దీన్ని సూచించడానికి దేవతలందరి దెగ్గిర ఓంకార సంకేతాలు ఉన్నాయి.

ఓంకారమే సప్త స్వరాలుగా మారింది. ప్రపంచంలో అన్ని నాదాలు సప్త స్వరాల సమ్మేళనాళే.

ఈ సప్తస్వరాలతో సంగీత విద్య ఏర్పడుతోంది. ఈ విద్యతో భగవతిని నిజమైన భక్తితో సేవించేవారు అసలైన ఓంకారోపాసన చేసినవారవుతారు. అందుకే శ్రీ స్వామిజి పూజలతో పాటు సంగీత సేవను ఏర్పాటు చేస్తారు.

సంగీతం పాడడమే కాదు, ఏకాగ్రతతో వినడం కూడా సంగీత సేవనే! అదికూడా ఓంకారోపాసననే! దీనిని ఆచరించే వారికి భగవతి కృపవల్ల తత్త్వదర్శనం దొరుకుతుంది.

-నవరాత్రి 1991, భక్తిమాల జనవరి 1992

Tags: