ముందు ప్రాపంచిక సుఖాలు అనుభవించి ఆ తర్వాత ఆధ్యత్మిక చింతన చెయ్యి. లేకుంటే ఇతరుల సంగంలో పడి చెడిపోయే అవకాశం వుంది. నీ మనస్సు నిశ్చలంగా, స్థిరంగా వుంటే చింతలేదు. ఇంద్రియాలు భోగలాలసతో వుంటాయి. నువ్వు వాటిని అదుపులో పెట్టి – నాకు బ్రహ్మమే కావాలి- అని చెప్పాలి. ఎటు నీ జీవితాన్ని మలచుకోవాలో నీవే ఆలోచించుకోవాలి.