SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
నాకు వయసు వస్తున్నా మనస్సుకు స్థిరత్వం రావడం లేదు..అప్పాజీని ఎప్పుడూ మనస్సులో తలుచుకోవాలంటే ఏమి చెయ్యలి?

చంచలస్వభావం నీ వెంటే వుంటుంది. నిన్నెప్పుడు వదలదు. దానికి వయోబేధం లేదు. నీకు వయస్సు వచ్చినా చంచలస్వభావం పోదు. అది నిత్యనూతనంగా, చైతన్యవంతంగా వుంటుంది. చంచలాదేవిని మరిచిపోవాలి. దాని మీద దృష్టి పెట్టకు. నువ్వు ముసలివాడవు అవుతున్నావని యమధర్మరాజు దయ చూపిస్తాడా, వదలిపెట్టడు, సమయం చూసి పట్టుకుంటాడు కనుక చంచలాదేవిని ఎలాగైనా సరే నీ మనస్సు నుంచి తీసేయాలి. అదే మార్గం.

Tags: