SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
సాలిగ్రామాలికి సరియైన పూజ జరుగకపోతే దెబ్బ కొడుతుందని అంటారు. వీటి గురించి చెప్పమని కోరుతున్నాను

సాలగ్రామాలు, రుద్రాక్షలు, స్ఫటిక (క్రిస్టల్) లింగాలు వివిధ ఆకారాలతో రాళ్ళ లాగ కనిపించినా పూజలో పెట్టుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు ప్రశ్నలోనే ఉంది. పాతభక్తిమాలలో వీటిని గురించి విస్తారంగా చెప్పడమయింది. కుప్పా కృష్ణమూర్తిగారు, నేను చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పము. ఇప్పుడు బాలస్వామిగారు చెబుతున్నారు. ఈ ప్రశ్న ద్వారా అందరూ భక్తిమాల చదవాలని చెబుతున్నాను.

గండకీదేవి విష్ణుమూర్తి వర ప్రభావంతో నదిగా మారింది. ఆవిడ భక్తి తీవ్రతకు వరంగా శ్రీమహావిష్ణువు ఆవిడకు పుత్రునిగా ఒక తులసిచెట్టుగా అవతరించాడు. గండకీనది ఒడ్డున కలసి వుంటాయి. వాటికి పూజచేస్తే శ్రీమహావిష్ణువుకి పూజ చేసిన ఫలితం దక్కుతుంది.

సాలగ్రామంలో ప్రాణం వున్న చిన్న పురుగులాంటి జీవి నిరంతరం విష్ణునామ స్మరణతో తమేకమై ఆ రూపాన్ని పొందుతుంది. శైవులు (శివుని పూజ చేసేవారు) సాలగ్రామాలు విష్ణు స్వరూపాలని వాటిని పూజించరు. కాని సాలగ్రామాలు శివునికి అత్యంత ప్రీతికరమైనవి. నిరాకార రూపుడైన శివుడు విష్ణువుని ధ్యానిస్తాడు. త్రిదళ బిళ్వపత్ర పూజ ఇష్టపడతాడు. విష్ణువుకి తులసీపూజ ఇష్టం.

విష్ణు సాలగ్రామాలు చాలా రకాలు. ఉదాహరణకు అనంతపద్మనాభ, విష్ణు, కేశవ, చక్ర…., ఈసాలగ్రామాలలో లోపల బంగారురేకు ఉంటుంది. చెక్కను శిల్పంగా చెక్కితే ఎలా పవిత్రతనాపాదించుకుంటుందో అలాగే సాలగ్రామం రాయి పూజలు చేస్తూ చేస్తూవుంటే క్రమంగా బంగారుశిల అవుతుంది.

చాలా మంది సాలగ్రామంలోని బంగీరు రేకు కోసం నదిలో సాలగ్రామాలకోసం వెతుకుతారు.

శ్రీమహావిష్ణువు విముక్తుడై తన శరీరం వదిలి విష్ణులోకం వెళతాడు. చాలామంది యోగులు చిన్నచిన్న సాలగ్రామాలను నోటిదగ్గర వుంచుకొని ఆ తీర్ధం తాగుతారు. ఆ తీర్థం పవిత్రమైనది. దానిలో చాలా రోగనివారణ శక్తులు ఉన్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో దాని గురించి ప్రస్తావన వుంది.

కొద్దిరోజుల క్రితం పాత నరసింహ సాలిగ్రామం పోయింది. తర్వాత దానిని ఒక పాత భక్తుడు నాకు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఇచ్చాడు. అక్కడే శివ దేవస్థానంలో వుంది.

సాలగ్రామాల మహత్యం చెప్పడానికి వీలుకాదు. వాటిని గురించి ఆలోచించు చాలు. అది మహిమ చూపిస్తుంది. సాలగ్రామ పూజ తీర్థం చాలా పవిత్రమైనది. పూజ చేస్తే చాలా ఫలితమిస్తుంది. చాలా మంది సాలగ్రామాల మీద భక్తిలేక దేవాలయాలలో ఇస్తారు. గుర్తుకోసం ఒక ఫోటో పెట్టుకుంటారు. వారికి నమ్మకం లేదు. పూజకు సమయం లేదు. కష్టాలు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం గుర్తుకు వస్తాడు.

సాలగ్రామాన్ని మన స్వంత వ్యక్తిగా భావించాలి. రోజు నైనేద్యం పెట్టి, మనం రోజూ తినే ఆహారాన్నే నైవేద్యం చేస్తే చాలు. పెద్దవాళ్ళు పూజలు చేస్తారు. మనం రోజూ దీపం పెట్టు చాలు. అగరవత్తులు వెలిగించు. ఆ వాసనకు దోమలుపోతాయి. మనస్సు ప్రశాంతమవుతుంది. మనం, మన ఇల్లు వృద్ధి పొందుతుంది. ఎవరైతే సాలగ్రామాన్ని ఆరాధించి పూజ చేస్తారో వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తే గండకీదేవి గర్భంలో జన్మించాడు.

Tags: