చిన్నపిల్లలు ఉపదేశ దీక్ష తీసుకోవచ్చా?
అసలు దీక్ష అంటే ఏమిటి తెలుసా అని అడుగు. ఆమెకు తెలిస్తే, ఇష్టపడితే, సరే.
అసలు దీక్ష అంటే ఏమిటి తెలుసా అని అడుగు. ఆమెకు తెలిస్తే, ఇష్టపడితే, సరే.
ముందు నుంచి ఆ ప్రసంగాల మీద ఇష్టంలేక శ్రద్ధగా వినలేదు. కనీసం చెప్పే వ్యక్తిమీద అభిమానంతో ఒక్క సందేశం వినుంటే క్రమంగా నీకు అర్థం కావడానికి అవకాశం వుండేది.
ఏదయినా పెద్దజబ్బు చేస్తే డాక్టరు కఠినమైన పద్ధతులు చెయ్యాలంటాడు. మనం చేయ్యలేము. కుర్చుంటే నడుంనొప్పి, నుంచుంటే కాళ్ళనొప్పి, శ్రీచక్రపూజ తీర్థం తీసుకుంటే జలుబు చేస్తుంది.
ముందు ప్రాపంచిక సుఖాలు అనుభవించి ఆ తర్వాత ఆధ్యత్మిక చింతన చెయ్యి. లేకుంటే ఇతరుల సంగంలో పడి చెడిపోయే అవకాశం వుంది.
ఏకాగ్రత సాధనకు నాద బ్రహ్మ అవసరం. నాదం వినిపిస్తున్నపుడు మరి ఏ ఇతర శబ్దం మనస్సును ఆకర్షించదు.
చంచలస్వభావం నీ వెంటే వుంటుంది. నిన్నెప్పుడు వదలదు. దానికి వయోబేధం లేదు. నీకు వయస్సు వచ్చినా చంచలస్వభావం పోదు.
సాలగ్రామాలు, రుద్రాక్షలు, స్ఫటిక (క్రిస్టల్) లింగాలు వివిధ ఆకారాలతో రాళ్ళ లాగ కనిపించినా పూజలో పెట్టుకోవాలి.