నాదమంటపం సావనీరు ఒకటి చిన్నపుస్తకంగా వెలువడింది. అందులో వారి గురించి వారి ఖ్యాతి గురుంచి వివరంగా రాయబడింది. వారందరి కీర్తనలు పాడాలంటే స్వామీజీ మరోజన్మ ఎత్తాలి. మెజార్టు ఎలా పాడగలను. వారి కీర్తనలు స్వీకరిద్దాం. యిప్పటి వాద్యకళాకారులందరిని నా భజనలు వినమంటన్నాను. మళ్ళీ పుట్టి వాటిని పాడమంటున్నాను. వాళ్ళల్లో కొందరు మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, గుడ్డివాళ్ళు మానసికమైన బాధతో సతమతమవుతూ నిద్రలేక అవస్థపడేవారు. అయినా వాళ్ళు అద్భుతంగా గానం చేసేవారు. నేను వాళ్ళని మళ్ళీ వచ్చి గానం చెయ్యమని భావితరాలకు ఆ ప్రాభవాన్ని పంచమని కోరాను. వాళ్ళంత తిరిగి వచ్చి నాదప్రసాదం చేస్తారు. అది మీలో కొందరు జీవించి వుండి వింటారు. కొంతమంది వెళ్ళిపోతారు.