నువ్వు భజన చేస్తుంటే ఒక్కోసారి మనసు అటు ఇటు పరిగెడుతుంది. దాంతో రాగం తప్పుతుంది. స్వరం మర్చిపోతాము. అక్షరాలు తప్పు పలుకుతాము. అందుచేత భజనలు చేసేటప్పుడు శిరస్సు మాత్రమే చూడు. వాళ్ళకళ్ళల్లోకి కాదు. అలాగే నువ్వు భజన చేస్తున్నప్పుడు అక్కడ వున్నవారు ఫోనులో మాట్లాడుతుంటారు. నీకు కోపం వస్తుంది. చిరాకు పడతావు. వాళ్ళు నిన్ను చూసి నవ్వితే నిన్ను అవమానించినట్లు బాధపడుతావు. అందుచేత నీ పనేదో నువ్వు చెయ్యి. అదే ఏకాగ్రత నాదచికిత్స ఆ ఏకాగ్రత నీకు సిద్ధిస్తుంది, నీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.