నేను ఎంతోమంది పిల్లలను భజన పాడడానికి రమ్మన్నాను కాని వారు రాలేదు. పిల్లలు చిన్నవాళ్ళు. అందుకే వాళ్ళ గొంతుక కీచు గొంతుకలా వుంది. వాళ్ళను నేనే తీసుకున్నాను. రాబోయే కాలంలో వీళ్ళే యీ భజనలు పాడుతూ వాటి ప్రభావాన్ని దిగంతాలకు పెంచుతారు.
విడివిడిగా పాడితే వాళ్ళ గొంతుక శ్రావ్యంగా వుంటుంది. కానీ గుంపులో కీచుగా వస్తుంది. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాను.
వాళ్ళ గొంతుక రాటు తేలి విన శ్రావ్యంగా మారలనే వాళ్ళకి మైకు పెట్టకుండా పాడిస్తున్నాను.
భజనలకు కూడా స్వరం వుంది. అది క్రమకమ్రంగా రాగ పద్ధతిలో సాగిపోతుండాలి.
పల్లవి, అనుపల్లవి, చరణం ఒక్కో చోట ఒకమాటు, మరో చోట రెండుసార్లు పాడుతుండాలి. ఇది సంగీతానికి దగ్గరగా వుంటుంది. అందుకే చాలా మంది సంగీతకారులు నా భజనలు ఇష్చపడతారు. సమిష్టిగా పాడడానికి వారికి అవకాశం కల్పిస్తున్నాను.
అలాగే రాసిన పాటలు చాలా వున్నాయి. మా అమ్మ రాసినవి, నాకు గుర్తున్నవి. నా చేతిరాత బాగుండదు. అందుకే కుప్పా కృష్ణమూర్తి, బాలస్వామి, డా- స్వర్ణప్రసాదు, డా-ఫణిశ్రీ అందరూ నాకు సహాయం చేస్తుంటారు.
కుప్పా కృష్ణమూర్తి గారితో గంటల తరబడి దాని పద్ధతి, బీజాక్షరాలు, స్వరాలు చెప్పి వాటిని నలుగురికి అర్థమయ్యే చిన్న చిన్న సంస్కృత పదాలు వాడి చెప్పమంటాను.
నేను ఎవరి పాటలు పాడను. ఎందుకు పాడాలి. నా భావాన్ని చిన్నచిన్న మాటలతో నా భక్తుల ద్వారా రాయించి పాడతాను. ఎవరు నా పాటలకు రచయిత, స్వరకర్తలు కారు. నా తర్వార ఈ రోజుకి ఎవరూలేరు.
నా మార్గాన్ని, ధర్మాన్ని ఉద్ధరించి ముందుకి నడిపించే యోగ్యుడిని ఎన్నుకుని వానికి నేర్పుతాను.
అయినా కొన్ని గొప్పసంగీతకళాకారులు స్వరకల్పన చేసి కొన్ని పాటలు, మరాఠి పాటలు పాడాను. మీరు చెప్పినట్లు చాలా సి.డి లు రావసి వున్నాయి. చాలా మటుకు వచ్చాయి. ఐట్యూన్స్ లో వాటిని డౌన్లోడ్ చేసి చూడండి. స్వల్పధరకే లభ్యమవుతున్నాయి.
నా జవాబు తృప్తికరంగా వుంది. ఇది మంచి ప్రశ్న.