స్వప్నం అనేది మిథ్య. నువ్వు దేని మీద ఎక్కువగా ఆలోచిస్తే అది మనసు మీద ముద్ర పడుతుంది, మనసు ఆ ముద్రని స్వప్నంలో దర్శిస్తుంది. ఇదే సైన్సు పగలంతా ఏది ఎక్కువగా ఆలోచిస్తే అదే రాత్రి స్వప్నంలో కనిపిస్తుంది.
స్వామీజీ కొంతమంది భక్తుల స్వప్నంలో కనిపిస్తారు. కాని కల్మషమయిన మనస్సు వుంటే అక్కడ స్వామీజీ రారు. కొంతమందికి కలలు రావు. అది మంచిది. భగవంతుడు ఇచ్చిన గొప్పవరం. స్వప్నం అంటే గాఢనిద్ర లేదన్నమాట. స్వప్నాలు వస్తే మనసు అలసిపోతుంది.
స్వామీజీ స్వప్నంలో వస్తే మంచిదే. అది వారివారి ఆలోచనలు బట్టి వుంటుంది. స్వప్నం రాలేదంటే మంచిది. స్వామీజీ స్వప్నంలో వచ్చారంటే ఆ భక్తుడి మనసులో స్థిరముద్ర పడిందన్న మాట.