SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
యోగులు ఎందుకు హిమాలయాలకు వెళ్తారు? హిమాలయాల ప్రాముఖ్యత ఏమిటి?

నేను హిమాలయాల ప్రాముఖ్యతను చెబితే మీరు కూడా వెళతానంటారు. అందుకే నేను చెప్పను. శివపార్వతులు నా తల్లిదండ్రులు అందుకే అక్కడికి వెళ్ళాలని అనుకుంటాను. కోపంతో కాదు. యోగులు సాధన కోసం హిమాలయాలకు వెళ్తారు. అది చాలా ప్రశాంతమయిన వాతావరణం కలిగి జపతపానికి అనువుగా వుంటుంది. గృహస్తు జీవితంలో వున్నవారు వెళ్ళలేరు.

మీకు ఇల్లు, బంధువులు, డబ్బు, వృత్తి బాధ్యతలు వీటితోనే సతమతమవుతారు. ఒకవేళ వెళ్ళినా కూడా బాధ్యతలు వాళ్ళని వెనక్కి లాక్కువస్తుంది.

కాని నేను వెళ్ళగలను. అలాగే ఏదో రోజున మీరు కూడా వెళ్ళగలుస్తారు. యోగులు ఎందుకు వెళ్ళతారంటే అది వాళ్ళ తల్లిదండ్రులు, శివపార్వతులు వుంటున్న స్థలం.

అక్కడ వాళ్ళ కఠినమైన పద్ధతులలో సాధన చేస్తుంటే వారి శిరస్సుల నుండి అగ్ని బయటకు వచ్చి వాతావరణాన్ని చల్లబరచి వాళ్ళని రక్షిస్తుంది. కఠినమైన సాధన కావాలి. నిజానికి సాధన చేయాలంటే హిమాలయాలకు వెళ్ళక్కరలేదు. ఇక్కడే వుంటూ బంధాలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలి.

ఈ శరారం దేవాలయం ఇందులో భగవంతుడు ఉన్నాడు. దాన్ని చక్కగా చూసుకోవాలి. ఇంటినెలా జాగ్రత్తగా బాగుచేసి రంగురంగుల అలంకరణలు చేసి చూసుకుంటావో అలాగే శరీరాన్ని కూడా కాపాడుకోవాలి.

అలా చేస్తూ కూడా – నేను శరీరం కాను, ఈ ఇంద్రియాల్ని కూడా కాను.- అని భావించాలి. ఈ సాధనలో పట్టు చిక్కితే నువ్వు నలుగురిలో వున్నా నీ సాధన కొనసాగుతుంది. ఇంద్రియాల్ని జయించగలుస్తావు. ఇంద్రియాల్ని జయించగలుస్తావు. హిమాలయాలకు వెళ్ళే ఆలోచన చేయచ్చు.

ఈ భూమి మీదకు నువ్వు ఒక కారణంగా వచ్చావు. అగస్త్య మహర్షికి శివుడు దక్షిణ భారతంలో వుండిమని అదేశించాడు.దక్షిణ భారతం హిమాలయాల కన్నా తక్కువ మహత్యం కలది కాదు. దక్షిణ భారతం కర్మభూమి . ఇక్కడ కర్మక్షయం చేసుకోవచ్చు కనుక కర్మముక్తి క్షేత్రం అయింది.

ఒకసారి కర్మబంధాల నుంచి తప్పించుకుంటే నీకు జీవనముక్తి దొరుకుతుంది హిమాలయాలకు వెళ్ళాలి అనుకుంటే చాలు. అదే పుణ్యం. అలాగే కాశిగాని, ఆశ్రమం గాని వెళ్ళాలని అనుకుంటేచాలు. మనస్సు వెంటనే అక్కడకు పరిగెడుతుంది. స్వామీజీని నిత్యం తలుచుకుంటే మనస్సు ప్రశాంతమవుతుంది. ఆ ఊహే చాలా మంచిది. ఆ ధ్యానమే మనకు ఊర్ద్వలోకాలకు ప్రయాణించడానికి సాధన అవుతుంది.

Tags: