మీకందరికి భాగవతంలో ఒక కథ తెలుసు. సత్రాజిత్తు దగ్గర వున్న మహత్తుగల ఒక ప్రత్యేకమైన మణిని శ్రీకృష్ణుడు దొంగలించాడనే నేరం ఆయన మీద మోపబడింది. సత్రాజిత్తు ఆ మణిని సభలో అందరికి చూపించి అ మణి తనకు దేవేంద్రుడు, సూర్యూడు ఇచ్చారని చెప్పాడు. సభలోని వారంతా ఆ మణి శ్రీకృష్ణుని వద్దనుంటే బాగుంటుందని భావించారు. ఆ సభలో వున్న స్త్రీలంతా శ్రీకృష్ణుని వద్దనుంటే బాగుంటుందని భావించారు.
శ్రీకృష్ణుడు కూడా ఆ మణిని చేతిలోకి తీసుకుని, పొగిడి తిరిగి ఇచ్చేశాడు.
ఎవరైతే యీ సృష్టిని అంతా చేశాడో, స్వర్గాన్నుంచి ఆమణి వచ్చేలా చేశాడో ఆయన దోషి ఎందుకవుతాడు. ఒక్క ఉద్దవుని తప్పించి ఆయన్ని అభిమానించే దగ్గర వాళ్ళంతా ఆయన్ని దోషి అన్నారు. శ్రీకృష్ణుడిని అభిమానించి భక్తిభావంతో ఆయనకు తన్ను సమర్పించుకున్న కుంతీ దేవి కూడా అనుమానించింది. దానితో ఆమె భక్తిభావం తగ్గిపోయింది. తరువాత శ్యమంతక మణి జాంబవంతుని దగ్గర దొరికింది. అది వేరే కథ. ఇప్పుడు చూడాల్సింది ఇంతమంది అభిమానులు ఆయనను దోషి అంటే ఎలా తట్టుకున్నాడు. అంతలా అభిమానించి కొలిచే భక్తులు ఎలా మారారు, ఆశ్చర్యంగా లేదా,
మీరంతా గుర్తుంచుకోండి. ఒక్కసారి మీ గురువుని భగవంతుడు అని మీరు భావిస్తే అదే ఆఖరు. పరిస్థితులు ఆ భావనని మార్చకూడదు. గురువు మీద అపనమ్మకం పెట్టుకోకూడదు.
కానీ ఇక్కడ అందరూ అపనమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళంతా శ్రీకృష్ణుని నుంచి దూరమైపోయారు. ఇదే మాయ కమ్మడం అంటే. అదే శ్రీకృష్ణుడు చేశాడు.
నిజానికి పూర్తి సమర్పణ భావంతో వున్న భక్తుడే లేడు. వాళ్ళ కోరిక తీరకపోతే వారికి స్వామీజీ మీద నమ్మకం తగ్గుతుంది.
ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు భక్తుడు ఎలా ఉండాలో తెలియచెప్పడానికి కల్పించిన మాయ.
వాళ్ళ అనుమానాలు, సందేహాలు, తర్వాత కలిగే ఆలోచనలు, పశ్చాత్తాపాలు ఇవన్ని వాళ్ళని నిజమైన భక్తులుగా మలచాలనే కోరికతో చేసిన మాయ.
నా గురువు సర్వాంతర్యామి. అయన నరకానికి వెళితే నేనూ వెళతాను. ఆయనే నా సర్వస్వం. ఆయన ఏది చెబితే అది చేస్తాను అనే భావన వున్నవాడే భక్తుడు. శ్రీకృష్ణుని దగ్గర ఎన్నో మణులు ఉన్నాయి. అని ఆయనకు కావాలా, ఆయన కోరారా. 16000 మంది స్త్రీలు ఆయనకు సేవకులుగా వచ్చారు.వారంతా ఆయనకు కావాలా, ఆయన కోరారా, ఆయనే సృష్టికర్త, ఆయనకు ఇవేమీ అక్కరలేదు. ఇదంతా కావాలనే ఆయన చేశాడు. ఎవరైతే నిజమైన భక్తులు కారో వారిని దూరం చెయ్యాలనే చేశారు. ఎవరైతే స్థిరబుద్ధితో, భక్తి భావంతో వుంటారో వారికి మోక్షం ఇవ్వలనే చేశాడు. శ్రీరాముడు ఇక్కడే పొరపాటు చేశారు. ఆయన తన వారందరికి మోక్షం ఇవ్వాలని తనతో రమ్మని చెప్పి తాను మాత్రం సరయూనదిలోకి వెళ్ళి అక్కడ నుంచి వైకుంఠం వెళ్ళిపోయాడు.
అవతార పురుషులు, భగవదంశంతో పుట్టిన వారు ఒంటరిగానే వెళ్ళాలి. అదే శ్రీకృష్ణుడు చూపించాడు. అందరిని వదిలి తాను ఒక్కడే వెళ్ళాడు.
నీతి ఏమంటే నీ గురువుని అనుమానించకు. ప్రశ్నించాలంటే అది నీ మనస్సును శుద్ధపరచి నిన్నుమంచి దారిలో నడిపించేలా వుండాలి.