స్వామిజి అన్నిటిని సమానం గా భావసితారు. నీతో మాటలాడుతున్నపుడు, నువ్వు నీ కష్ట-సుఖాలను తెలుపుతున్నపుడు, ఆయన నీ లో ప్రవేశించి నీ కష్ట సుఖాలను పంచుకుంటారు. నువ్వు వికారంగా ఉన్నపుడు ఆయన కూడా విచారంగా ఉంటారు; నువ్వు సంతోషముగా ఉన్నపుడు వారు కూడా సంతోషిస్తారు. వారు నీ మట్టమునకు వచ్చి తిరిగి వారి మట్టమునకు వెళ్తారు. స్వామిజి కి సంకల్ప సిద్ధి కలదు. కావున వారు ఎల్లవేళలా ప్రశాంతముగా ఉంటారు. సంతృప్తిగా కూడా ఉంటారు.
(తెలుగు భక్తిమాల నవంబర్ 1980)