SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
దేవతా పూజ చెయ్యడానికి చాలా పద్ధతులు వున్నాయి. మరి సద్గురువుని ఎలా పూజించాలి ?

దయచేసి నన్ను దేవుళ్ళకు చేసినట్లు నూనెతోనూ, నీళ్ళ తోనూ అభిషేకం చెయ్యకండి. ఈ శరీరం పంచభూతాలతో తయారయింది. దీనిలో మనమంతా సూక్ష్మరూపంతో ఉన్నాము. కనుక మీరు నన్ను ఆ సూక్ష్మ శరీరుని భావిస్తూ నీళ్ళు, పాలు, పెరుగు, పూవులు, పత్రితో పూజ చేస్తున్నారనే భావనతో ఆరాధించండి.

మీ భక్తి పరిపూర్ణం అయితే మీ మనస్సును అలా ఆరాధించికు అనుభూతి, ఫలం దక్కుతుంది. యీ నా శరీరం పంచభూతాత్మమై యీ గురుపాదుకలలో నిబిడివుంది. మీకొక బ్రిటిష్ కలెక్టరుగారి కథ చెబుతాను. ఆయన ప్రతిరోజు తిరుపతి వెంకటేశ్వరస్వామికి పూజారులు చేస్తున్న పూజలు, నైవేద్యం చూసి హేళనగా - మీ రాతి దేవుడు యీ సమర్పణలు అన్ని తింటాడా అని ఎగతాళి చేసేవాడు. ఆ ఆఫీసరుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆలయ అర్చకులు ధర్మాన్ని అతిక్రమించి, పూజ చెయ్యకుండా ముందుగా నైవేద్యం రుచి చూడడం నిషిద్ధం అయినా ఆయన్ని రమ్మని పూజ ముందు ప్రసాదం తినమని, నైవేద్యం తర్వాత అదే ప్రసాదం తినమని యిచ్చారు. ఆయన అది తిని రుచిలో తేడా చూసి నమ్మకంతో వెళ్ళిపోయాడు.

కనుక నైవేద్యం రాతి దేవుడు తింటాడా? ప్రాణప్రతిష్ట అయ్యాక ఆ శిలకు జీవశక్తి వస్తుంది. ఆ జీవశక్తిని పొందిన విగ్రహం నైవేద్యం నిజానికి తినదు కాని దృష్టితో గ్రహిస్తుంది. ఒకచూపు చాలు. విగ్రహం మాత్రం నిగ్రహంగా ఉంటూ కంటిచూపుతో అనుగ్రహిస్తుంది. స్వామీజీ శివరాత్రినాడు శివుడులా వుంటారు. మరి మరునాడు ఎలా వుంటారు. మనం అదే రూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకుని ధ్యానం చెయ్యాలి. అది మార్చుకోవడానికి వీలులేదు ఒకసారి నమ్మితే మరి మార్పు వుండకూడదు. స్వామీజీ మీరు మమ్మల్ని నీటిలో ముంచినా మీఇష్టం, తేల్చినా మీ ఇష్టం అనాలి. బావిలోకి దూకమంటే దూకడమే, అంతేకాని బావిలోకి ఎందుకు దూకమన్నారు, బావిలోతు ఎంత- అని ఆలోచించకూడదు. ఈ భావన మీలో వుంటే మీరు ఆత్మద్రోహం, ఆత్మహత్య చేసుకున్నట్లే.

Tags: