33. కుటుంబంలో కొందరు భగవంతుని నమ్మరు. అలాంటి వారికి మనం ఎలా సహాయం చేయగలను
నీవు పీల్చే ఊపిరే నీ ప్రాణాలను కాపాడే చైతన్యశక్తి, నీలో ప్రవహించే నీ ప్రాణశక్తి నీకు మాత్రమే అనుభవానికి వస్తుంది.
నీవు పీల్చే ఊపిరే నీ ప్రాణాలను కాపాడే చైతన్యశక్తి, నీలో ప్రవహించే నీ ప్రాణశక్తి నీకు మాత్రమే అనుభవానికి వస్తుంది.
దీన్ని ఎవరూ మార్చలేరు. నీ వరకు జాగ్రత్తపడు. అందరికి మంచి బుద్ధినిమ్మని ప్రార్థించు. నన్ను అడుగకు.
బాహాటంగా అందరికి చెప్పకు. నీ పిల్లల్ని తల్లిని, పిల్ల మానాన్ని ఎలా రక్షించుకుంటారో అలాగే గురువును కూడా రక్షించుకోవాలి.
ఈ కలియుగంలో అక్కరలేదు. నువ్వు అనసూయవు కాదు. నీ భర్త అత్రి మహర్షి కాదు.
పందాలు మంచివి కావు, దుర్యోధనుడు వంటి కుటిల స్వభావులు దానిలో మునిగిపోయి నాశనమైపోయారు. మన పురాణాలు మనసు మీద ప్రభావం చూపిస్తాయని చెప్పారు.
నీకు కోపం వస్తోందని తెలిసినప్పుడు 100 సార్లు – తాతాజీ- అని జపించు. కోపం దానంతట అదే ఎగిరిపోతుంది.
సేవ ఇంకా బాగా చెయ్యి, చదువు నీకు రక్షణ యిచ్చిందా, గురువు నీకు ప్రాణదానం చేశాడు.
అతి తెలివి మంచిది కాదు. మన మనస్సు నిండా ఆలోచనలే, అలాగే మందకోడితనము కూడా మంచిదికాదు.
కర్మానుసారంగా ప్రతీజీవి ఎన్నో జన్మలనెత్తుతాడు. ప్రతీ జీవికి ఒక ఖాతా వుంది. శ్రీరాముడు కష్టాలు పడ్డాడు.