SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
తిరుప్పావై అన్న పవిత్ర గ్రంధంలో ఆండాలు రాసిన ఒక పాటలో – ఎవరైనా నిన్ను తప్పు చేశావని నిందిస్తే ఆ తప్పు నీవు చేయకపోయినా, తప్పు నీవే చేశానని ఒప్పుకోవాలి.. నేను చేయని తప్పును నేనెందుకు ఒప్పుకోవాలి.

నీకు ఆ పవిత్ర గ్రంధం మీద ఆమె రాసిన పాట మీద నమ్మకం ఉందా, ఉంటే గత్యంతరం లేదు. నువ్వు ఒప్పుకోవాలి. ఒక న్యాయాధికారి తీర్పు ఇస్తే నీవు నిరపరాధివైనా శిక్ష తప్పదు. నీవు ఏమి చెయ్యగలవు, దాని మీద పై అధికారి దగ్గరకు న్యాయంకోసం వెళ్ళగలవు. ఎందరో నిరపరాధులు జైలుకెళ్ళారు. ఉరితీయబడ్డారు, కారణం వారు తమ నిరపరాధిత్యమును నిరూపించుకోలేక పోయారు. ఇది సంత్ ఆండాలు మాట, తిరుగులేదు. స్వీకరించినా, వ్యతిరేకించినా నీ యిష్టం.

Tags: