కృత్రిమ జీవతానికి అలవాటుపడి సహజ జ్ఞానమును విస్మరిస్తున్నావు.
సహజంగా లభించిన శరీరసుఖాలతో తృప్తి చెందక కృత్రిమ జీవిత సుఖాలు ఆశిస్తున్న నిన్ను ఇతరులు విమర్శించడంలో న్యాయం వుంది. దానితో వారు నీ గురించి ఏమనుకుంటున్నారనే తపన కలుగుతుంది.
అలాగే నువ్వుకుడా ఇతరులను విమర్శిస్తున్నావు. ఆత్మ విమర్శన చేసుకోలేక పోతున్నావు. కృత్రిమ సంగము వలన విమర్శనాశక్తి నశిస్తుంది. నమ్మకం తగ్గిపోతుంది, ఇది అంతా ఒక ముళ్ళదారి.