మానవ ప్రయత్నం ముందే నిర్దేశింపబడలేదు. భగవంతుడు సృష్టి చేసిన యీ జగత్తులో నువ్వు నా కర్మానుసారం పని చేస్తావు. భగవంతుడు విత్తనాలు మాత్రమే జల్లాడు. కానీ నీరుపోసి, పెంచి, పండ్లు కోసి తినమని నీకివ్వడు, నువ్వు బ్రతకడానికి మార్గం చూపించాడు. అగ్ని, నీరు, వసతులు, ప్రాణులను ఒకేసారి సృష్టించాడు. నువ్వు పంట పండిచి, కోసి, నీరు, నిప్పు సహాయంతో వండుకోవడం నీ వంతు. విత్తనం చల్లడమొకటే భగవంతుని సృష్టి. విత్తనం జల్లాడు కదా అని అన్నిటికి వత్తిడి చేయడానికి నీకు అధికారంలేదు. నువ్వు బ్రతికి జీవితంలో ముందుకు రావాలని, పరమాత్మ నిన్ను, నీతో బాటు అన్ని సదుపాయాలు, వసతులు కల్పించాడు. అదే మానవ ప్రయత్నం.
ప్రోగ్రాములు, కంప్యూటరైజేషన్ అని ఎన్నో మాటలలో భగవంతుని గురించి చెప్పావు. చాలా బాగుంది.