గురువుకు అన్ని తెలుస్తాయి. నేను వాటిని తప్పించగలను. కాని తప్పించను, కర్మ నువ్వు అనుభవించవలసినదే, గురువు ఆ కర్మను అనుభవించే శక్తి యిస్తాడు. ఇదే ఆధ్యత్మిక తత్త్వము లేక కర్మసిద్ధాంతం. నేను నీకు మార్గం చూపిస్తాను.
గురువుకు సేవ చేసి నీ కర్మను ప్రాయశ్చిత్తం చేసుకో, నేను నీ కర్మను తీసుకుంటే నీకు కర్మ విముక్తి ఎలా అవుతుంది, ఎప్పుడు నేర్చుకుంటావు, మన కర్మలు మనమే అనుభవించాలి. భగవంతుడు క్షమించడు మనల్ని శిక్షించి మనలో మార్పు తాసుకువస్తాడు. అదే మన వేద పురాణాలు ఘోషించి చెబుతున్నాయి. గురువు నీకు జీవిత మార్గదర్శకుడు. నువ్వు హిమాలయాలు ఎక్కాలంటే నీకొక షెర్పా తోడు కావాలి. అతను నువ్వు ఎలా ఎక్కాలి, ఎక్కడ తాడు వెయ్యాలి అని చెబుతాడు. గురువు సహాయం లేకుండా నువ్వు సంసార బంధాలను దాటలేవు. శబరిమలై వెళ్ళాలన్నా నీకు గురుస్వామి ఎలా వెళ్ళాలి, ఏ పూజలు చేయాలి ఆ పద్ధతులన్ని చెబుతాడు.
నువ్వు దత్తసద్గురువు దగ్గరకు వచ్చావంటే ఆయననే నీకు మార్గదరశకుడు అని అర్థం, షెర్పా నిన్ను గమనిస్తూనే మిగితావాళ్ళకి జాగ్రత్తలు చెబుతాడు. లేకపోతే జారిపోయే ప్రమాదం వుంది. గురువు సహాయం లేకుండా నువ్వు యీ బంధాలు దాటలేవు. దానికి గురువు మార్గం సూచిస్తాడు. కాని నువ్వు ఒక్కడవే దాటే ప్రయత్నం చెయ్యాలి.
బాగా అర్థం అయ్యిందా.