SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
మంచివారికే ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి?

కర్మానుసారంగా ప్రతీజీవి ఎన్నో జన్మలనెత్తుతాడు. ప్రతీ జీవికి ఒక ఖాతా వుంది. శ్రీరాముడు కష్టాలు పడ్డాడు. శ్రీరమణమహర్షి కూడా కష్టాలు పడ్డారు. శ్రీరాముడు తన తండ్రి మరణ సమయంలో దగ్గరలేడు. చివరికి కర్మలు కూడా చేయలేదు. జీసస్ క్రీస్తు కూడా శిలునవాత పడ్డాడు. మహమ్మదును పిచ్చివాడన్నారు, కనకదాసు, రామదాసులను చాలా కష్టాలు పెట్టారు. ఇదంతా కర్మ ప్రహ్లాదుడు చాలా కష్టాలు అనుభవించాడు, ద్రౌపది చాలా అవమానం భరించింది. శ్రీకృష్ణుడు చివరి దాకా రక్షించడానికి రాలేదు. మీ ప్రోఫెసర్ వారంతటి గొప్పవాడు కాదు., చెడ్డవాళ్ళని చూసి నువ్వు వారి అభివృద్ధిని చూసి నువ్వు వారి వైపు ఆకర్షణ పెంచుకొంటున్నావు. వ్యక్తిమీద అభిమానం తగ్గించుకో, లేకుంటే నీకు బాధలు తప్పవు. అంత అభిమానం ఆయన మీద నీకుంటే నీ ప్రాణాలు పోసి ఆయన్ను బ్రతికించుకో లేకపోయావా- సానుభూతితో మాత్రమే మాట్లాడుతున్నావు.

ఏమి చెయ్యాలో తెలియక నీ మెదడు మొద్దు బారిపోయింది. మంచివాళ్ళు చెడిపోతే కష్టాలపాలవుతారు. చెడ్డ సాంగత్యం నుంచి దూరంగా ఉండు. మీ ప్రొఫెసర్ లా కష్టంలో వున్నా నవ్వుతూనే జీవితం గడుపు. మంచివాళ్ళని చూసునేర్చుకో. కాలం వృధా చెయ్యకు. శ్రీకృష్ణుడు కూడా బాణం దెబ్బకు విలవిలలాడాడు. రాముడు కూడా బాధపడ్డాడు. మంచిదేదో తెలుసుకొని ఆ దారిలో నడు. చెడ్డవాళ్ళని ద్వేషించకు. నలుగురు అన్నదమ్ములలో ఒకరు ధనవంతుడు(మిలినియర్) కావచ్చు కాని వాడు మిగిలిన ముగ్గురు (బీద) తమ్ముళ్ళకి సహాయం చేయకపోవచ్చు. నువ్వు మంచిగా వుండు.

Tags: