పందాలు మంచివి కావు, దుర్యోధనుడు వంటి కుటిల స్వభావులు దానిలో మునిగిపోయి నాశనమైపోయారు. మన పురాణాలు మనసు మీద ప్రభావం చూపిస్తాయని చెప్పారు. వాటికన్నా మంచి పనులు వున్నాయి. ఎవరికి కాలక్షేపం లేదో, ఆధ్యాత్మిక చింతన లేదో వాళ్ళు అలాంటి వాటిలో దిగుతారు. ఇవి జీవిత వికాసానికి కాని, దేశానికి కాని మంచి చెయ్యవు. భజనలు పాడు, తోటపని చెయ్యి, సమయం వృధా చెయ్యకు. టివి చూసి కళ్ళు పాడుచేసుకోకు. అంతకన్నా ఫుట్ బాల్ ఆడు. ధారణ శక్తి పెరుగుతుంది. మంచిది. కాలం వృధా చేయకు.