SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
పాఠాలు బాగా చదువుతాము. కానీ పరీక్ష రాసేటప్పుడు మర్చిపోతుంటాడు. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఏమి చెయ్యాలి?

అతి తెలివి మంచిది కాదు. మన మనస్సు నిండా ఆలోచనలే, అలాగే మందకోడితనము కూడా మంచిదికాదు. కంగారు, గాభరా కూడా ఒక కారణం. కొంత మందికి ఆత్మవిశ్వాసం వుంటుంది. ఇది పూర్వీకులు నుంచి వచ్చినది కాదు తల్లిదండ్రులు విద్యావంతులైనా పిల్లవాడు గొప్పవాడవుడతాడని చెప్పలేము. వాడి బుద్ధి వికాసం బట్టి వుంటుంది. నమ్మకం, విశ్వాసం వుండాలి. ప్రతివాడికి తేలివితేటలు వున్నాయి. చదవాలని ఆశక్తి వుండాలి. కేకలు వేస్తారనో, తల్లిదండ్రుల మీది భయంతోనో చదవద్దు. అలాగే సినిమాలు, చెత్త పుస్తకాలు వీడియో గేమ్స్ పాడుచేస్తాయి. అతిగా తినడం, నిద్రపోవడం కూడా కారణం సోమరిపోతుతనం వలన నీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తగు మాత్రమే భోజనం తీసుకో, ఆటలు వ్యాయామం మనస్సుకు ధృడం చేస్తుంది. బద్ధకం తగ్గుతుంది.

పిల్లలు పెందరాళే లేచి స్కూలు టైముకు ముందే తయారవ్వాలి. వెళ్ళేముందు శరీరం శుభ్రపరచుకో. యింటిని శుభ్రంగా వుంచు. కొంతమంది చురుకుగా వుంటారు. బాగా అర్థం చేసుకుంటారు. కొంతమందిలో ఆ చురుకుదనం తక్కున. బుద్ధి వికాసం తక్కువ. అందరిలోనూ బుద్ధి వికాసం వుంది. కుక్కలకు కూడ తెలివివుంది. మనిషి సోమరిపోతు. తల్లిదండ్రులకు చెప్పేది. పిల్లల్ని సోమరిపోతు తల్లిదండ్రులకు చెప్పేది. పిల్లల్ని ఒంటరిగా వదలద్దు. వారెదురుగా దెబ్బలాడుకోవద్దు. అది వారి మానసికశక్తి మీద దెబ్బ తీస్తుంది. వాళ్ళని వదలేసి టివిలు చూడనివ్వకండి. వాళ్ళు ఎలా చదువుతున్నారో గమనించాలి. పిల్లలు చదువులో వెనకబడితే తల్లిదండ్రులదే బాధ్యత.

Tags: