చెడ్డపని చెయ్యరాదు. అది చెడ్డది అని తెలిసి తప్పు చేస్తేఅది క్షమించరానిది దానికి ప్రాయశ్చత్తం లేదు. నీవు నీ సంకల్పాన్ని కాదని తప్పు చేస్తేదాని ఫలితం అనుభవించడానికి తిరిగి జన్మ తీసుకోవాలి. కర్మను తప్పించుకోలేవు.
వృత్తిరీత్యాగాని, పిల్లల భవిష్యత్తుని గాని తప్పు చేసినా అది క్షమించరానిది. భోగకాంక్షతో పిల్లలను కంటారు. తరువాత వారిని పెంచడానికి తప్పులు చేస్తారు. నువ్వు పిల్లలను సరిగ్గా పెంచాలి. గృహస్తుడవైనాక యింటి భాద్యతలు తప్పవు. అలాగని దాని కోసం తప్పుదారిలో వెళతానంటే అది క్షమించరానిది. నువ్వు శిక్ష నుంచి తప్పించుకోలేవు.