SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019

ఈ సృష్టిలో జరిగే ప్రతీకార్యం ముందుగానే నిర్ణయించబడిందని అంటారు, అలా అన్ని నిర్ణయించబడినప్పుడు మానవ ప్రయత్నానికి తావెక్కడుంది?

మానవ ప్రయత్నం ముందే నిర్దేశింపబడలేదు. భగవంతుడు సృష్టి చేసిన యీ జగత్తులో నువ్వు నా కర్మానుసారం పని చేస్తావు.

By Puttuadmin1 on 21 Jun 2019

కోర్కెలను ఎలా అణుచుకోవాలి?

కోర్కెలు తీర్చుకోవడానికి ప్రయత్నించకు. దానితో రెండోది రాదు. మొదట్లోనే కోర్కెలను అదుపులో పెడితే రెండోదానికి చోటులేదు.

By Puttuadmin1 on 21 Jun 2019

నా గతజన్మల పాపపుణ్యాలు, నేను చేసిన తప్పులు వాటికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి?

గురువుకు అన్ని తెలుస్తాయి. నేను వాటిని తప్పించగలను. కాని తప్పించను, కర్మ నువ్వు అనుభవించవలసినదే, గురువు ఆ కర్మను అనుభవించే శక్తి యిస్తాడు.

By Puttuadmin1 on 27 Jun 2019

హారతి ఇచ్చేటప్పుడు ఘంట ఎందుకు మ్రోగుతుంది?

శబ్దం మన మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రధానం . చర్చి లో ఘంట మ్రోగిన్నపుడు మనస్సు అటుఇటు పోకుండా కేవలం జీసస్ పైన కేంద్రీకృత మవుతుంది.