పరమాత్మ రూపరహితుడు, నిరాకారరూపాన్ని మనం చూడలేము. కనుకనే మనం పరమాత్మను చూడలేము. జప, ధ్యానములో మాత్రమే మనకు అనుభవంలోకి వస్తుంది.
గోళములు, రూపముతో వున్న వాటిని మాత్రమే మనం కాలము అని చెబుతాము. సరిగ్గా చెప్పాలంటే ఆకార, నిరాకారములని మనకి తెలిసిన ఉపమానాలు, ఆకాశము రూపం లేనిది. నక్షత్రాలు, ఖండాంతరాలు మనం చూడలేనివి అనేకం సుదూరంగా వున్నాయి. మనం ఒంటికొప్పల్ (మైసూరులో ఒక పేట) వెళ్ళాలంటే కారులోగాని, బస్సులోగాని, నడిచి కాని వెళ్ళోచ్చు. దానికి కొంత సమయం పడుతుంది. కాని మనసులో ఒంటికొప్పల్ ఊహించుకో వెంటనే అక్కడన్నావు.
కాలానికి శరీరానికి సంబంధం వుంది.కనుక శరీరంతో వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. కాలానికే మరో పేరు –కర్మ- దానినే కర్మ సిద్ధాంతం అంటారు.
ఆకాశానికి ఆకారం లేదు కాబట్టే కర్మ బంధాలు లేవు. అలాగే పరమాత్మ కూడ కర్మరహితుడు కాని ఆయన కూడా రూపాన్ని తీసుకున్నప్పుడు కర్మబంధాలలో చిక్కుకుంటాడు. కర్మబంధాలనుంచి దాటితే తప్ప కాలాన్ని దాటలేము. రాముడు కూడా అవతారం చాలించే ముందు నేను సరయూనదిలో మునిగి వైకుంఠానికి వెళతాను. సరయూనది అని ఎందుకన్నాడు, ఆయన ఒక రూపము, అవతారము స్వీకరించి కాలానికి వశుడై వున్నాడు కనుక ఆ రూపాన్ని వదిలి విశ్వంలో కలవాలి కాబట్టి అలా చేశాడు. మనకు మార్స్ కు వెళ్ళాలంటే నెలలు పడుతుంది. దానికి ఆక్సిజను కూడా కావలి. యీ వాతావరణంలో వున్న వ్యక్తి ఆ వాతారణంలో బ్రతకలేడు. ఈ శరీరం భరించలేదు. అది కాలాను వశమైంది.
ఇంతకన్నా వివరంగా చెప్పండి కుదరదు —– అనే పిచుకలు ఈ వివరణ చేసి చూపించడానికి ప్రయత్నించడానికి ప్రయత్నించింది. ఇది ఒక ఆధ్యాత్మిక డాక్యుమెంటరి దాన్ని పై వారం నాదమంటపంలో చూద్దాం.