ఫర్వాలేదు, ఎవరిని వదలక్కరలేదు, కానీ నువ్వు ధార్మిక జీవితం గడపాలనుకుంటే ఆ మార్గంలో నడిచే వారి పహవాసం చెయ్యి, ఇక్కడున్న వారిలో చాలా మంది యీ మమతల వ్యమోహాల నుంచి దూరంగా వుంటూన్నవారు వున్నారు. వాళ్ళు ఏ మానసిక వత్తుడులకు లోను కాకుండా జీవితం గడుపుతున్నారు. వారితో సత్సంగం చెయ్యి.
రామకృష్ణపరమహంస పెళ్ళి చేసుకుని కూడా మోహానికి వశం కాకుండా సాధనలో జీవితం గడిపారు. శారదామాత కూడ అలాగే నడిచింది. వారు ధ్యానసమాధిలో జీవించారు. నీవింకా చిన్నవాడివి పెద్దయ్యాక తెలుస్తుతుంది.
ఇక్కడ కుర్చున్నవాళ్ళని చూడు, భక్తితో కూర్చుని భజనలు పాడుతున్నారు. అదే సాధన. నువ్వు కూడా బయట లభించే అన్ని విధాల భోగాలను వదిలి ఇక్కడకు వచ్చావు. అదే సాధన, అదే మంచి మార్గం. అన్నింటిని వదిలి దత్తాత్రేయుడిని చూడ్డానికి వచ్చావంటే నువ్వు అన్నింటిని వదులుకున్నావనేగా…