SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
57. నేను సాఫ్ట్ వేర్ టెక్నాలజిస్టుగా పనిచేస్తూ ఆధ్యాత్మిక జీవనం ఎలా కొనసాగించాలి

ఏ వృత్తి నీవు చేస్తున్నా అది నీ జాతి ధర్మాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ఆటంకం కాదు. నువ్వు నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల అవసరాలు తీర్చుకోవడానికే సంపాదన చేస్తున్నావు, నువ్వు పెళ్ళి చేసుకుని సంసారజీవితాన్ని సాగిస్తున్నా ఇవేవీ నీ సాధనాజీవితానికి అడ్డురావు. నాసాలో పని చేస్తున్నవారిని చూడు. వారిలో 60 శాతం ఒంటరిగానే వుంటారు. వాళ్ళకి వృత్తే దైవం. సేవే ధర్మం. నువ్వు యాచకుడవైన ఎవరో ఒకరు సహాయం చేస్తారు.నీవు నీ కోసం పని చేస్తున్నావు. అందులో వుంటూ ధార్మక జీనితాన్ని గడుపుతూ మంచిమార్గంలో వుంటే చాలు. పెళ్ళి చేసుకోవాలంటే సరియైన వయసుకి చేసుకో, లేకుంటే నీ వృత్తే నీ భార్య అనుకో. పెళ్ళి కాలేదని బాధపడుతూ వుంటే పిచ్చేకుతుంది. పెళ్ళి చేసుకుని నీ ధార్మిక జీవితాన్ని గడపవచ్చు.

ఇక్కడున్నవారిలో చాలా మంది ఆడవాళ్ళు వున్నారు. వాళ్ళందరూ , ఇల్లు, పిల్లలూ, భర్తల అవసరాల్ని చూసుకుంటూ, సంసారం చక్కదిద్దుకుంటూ కూడా మంచి పుస్తకాలు చదవుతూ, భజనలు పాడుతూ, పూజలు చేసుకుంటూ కూడా సంతోషంతో స్వామీజీ సేవ చేసుకుంటున్నారు.

నిజానికి బ్రహ్మచారిగా వుండగలిగితే చాలా మంచిది. వయస్సు దాటిపోయాక పెళ్ళి చేసుకుంటే ఏమి ప్రయోజనం. 40 సం- దాటక పెళ్ళి ఎందుకు అభిమానం వుండదు. వయసులో వుండగా చేసుకోకపోతే , చెడు మార్గాల ద్వారా ఇంకొకరి భార్యను కామించడం, వాళ్ళ సంసారల్ని కూల్చడం, ఇది పెద్దపాపం, వయసులో పెళ్ళి చేసుకుని ధార్మికంగా సంసార జీవితం గడపడం గృహస్థ ధర్మం.

పిల్లలు పుడతారా లేదా అనేది నీవు చేసుకున్న కర్మఫలితం, కాని అది కూడ నీ ఆధ్యాత్మిక జీవితీనికి ఆటంకం కారాదు.

Tags: