SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
గురుగీతలో యీ విశాల విశ్వమంతా గురువులో వుందని, గురువే యీ అనంతమైన యీ ప్రపంచం అని చెప్పారు. అదెలాగ సాధ్యం.

ఎందుకు కాదు. నీ అంతర్ నేత్రంలో నీ లోపల చూడు. యీ విశాల ప్రపంచం అంతా నీ గురువులోనే వుంది. అంతా నీ గురువే, యీ విశాలవిశ్వం అనంతం. జ్ఞానదృష్టితో గురువు మీద ధ్యానం చెయ్యి, నేనే అనంతుణ్ణి, నేనే విశ్వాన్ని. విశ్వమంతా నాలోనే ఉందని గ్రహిస్తావు. అదే గురుతత్త్వం. అదే చివరిగా పొందదగినది. జ్ఞానానికి కూడా అవధులు ఉన్నాయి. కాని గురువుకి లేదు. గురువు విశ్వప్రేమ పంచువాడు. అందుచేత ఆయనే విశాల విశ్వం ఎందుకు కాకూడదు.

నేను భక్తి విశ్వాసాలతో సంపూర్ణంగా నా తల్లియే యీ విశాలవిశ్వంగా గుర్తించాను. దానిలో సందేహం లేదు. మీరేమో ఎప్పుడూ సందేహాలతోనే అడుగుతుంటారు. మీ గురువు అనంతుడు, జయలక్ష్మీ మాతయే యీ ప్రకృతి అంతా. ఎందుకు సందేహిస్తున్నారు. ఆ పరాశక్తి జయలక్ష్మీ మాత అయినా, దేవి, దుర్గ అయినా ఆమెలోనే యీ అనంతమైన విశ్వాన్ని చూస్తున్నాను.

ఎప్పుడూ సందేహాలతో వుండేవారు నిజమైన భక్తుడు కాదు. మీరు అడగాలి కాని దానికి ఒక హద్దు వుంది. భరద్వాజ మునిలా శాస్త్రాలు చదవడం ఒక్కటే జ్ఞావసంపాదించడం కాదు, ఆయల చదివి చదివి చివరకు ఆ చదువు వలన ప్రయోజనం లేదని గ్రహించారు.

నేను ఆయన వంశంలోనే జన్మించాను. ఈ చదువుల ప్రయోజనం లేదని వదిలేశాను.

పాత్రలో ఎంత పడుతుందో అంతే పోయాలి కాని యింకా యింకా పోస్తే ఏమవుతుంది. పాలు కారిపోతాయి.

త్యాగరాజు శ్రీరాముడి మీద భక్తితో చాలా కీర్తనలు చేశాడు ఒకసారి ఆయన సోదరుడు విగ్రహాన్ని దొంగలించి నదిలో విసిరేశాడు. ఆయన విగ్రహం పోయినందుకు చాలా బాధతో ఏడిస్తే కలలో శ్రీరాముడు కలబడి – నా ఒక్కడి మీదనే కాదు అందరి మీద కీర్తనలు వ్రాయి- అని చెప్పాడు. దాని తర్వాత – ఆయన ఎందరో మహానుభావులు అందరికి వందనాలు- అని కీర్తంచాడు. ఆయన సాధనతో, తపస్సుతో, భక్తితో పూజలు చేసి చివరికి – యీ ప్రకాశాలే భగవంతుడు- వెలుగే దేవుడు అని గ్రహించి ముక్తిచెందాడు.

ఆయనలోని భక్తి భావనే నాదముగా అదే ముక్తి సాధనగా మారి చివరికి కైవల్యం సిద్ధించింది. అందుచేత మనం సోమరిపోతులాగా సందేహాలే అడుగుతుంటే మనల్ని పరిక్ష చేస్తూ, శిక్షిస్తూ మనలో మార్పుతెస్తారు.

Tags: